Bill Gates Success Tips : జీవితంలో డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది. కానీ ధనవంతులు మాత్రమే ఉన్న డబ్బును రెట్టింపు చేస్తున్నారు.. పేదవారు, సామాన్యులు మాత్రం వారి స్థాయికి ఎగలేకపోతున్నారు. అందుకు కారణం అవకాశాలు.. కుటుంబ సభ్యుల సపోర్టు ఏమాత్రం కాదని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు. ధనవంతులు కొన్ని రకాల టిప్స్ ను ఫాలో అవుతుంటారని.. వాటిని సామాన్యులు పాటించినా కూడా వారి స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇంతకీ డబ్బున్న వారు పాటించే ఐదు టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
- స్కిల్ ను నమ్మండి:మీరు ఏదైతే ఒక పనిని చేయాలని అనుకుంటున్నారో.. దాని గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణకు ఒక ప్రోడక్ట్ ను ప్రజల్లోకి తీసుకోవాలనుకుంటే.. అది ఇచ్చే లాభాలు.. దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి.. ఆ ప్రోడక్ట్ ను ఎంతకు కొనుగోలు చేసి తిరిగి ఎంతకు విక్రయిస్తున్నాం.. అనే విషయాన్ని మీ స్టైల్ లో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేయాలి. ఈ స్కిల్ లో వాక్చాతుర్యం కూడా ఉండాలి. ఇలా మీరు ఏదైనా ఒక పనిని పూర్తిగా నమ్ముకొని ముందుకు వెళ్తే ఆ తర్వాత ఏది చేసినా కూడా ఈజీ అయిపోతుంది.. ఉదాహరణకు రతన్ టాటా తాను ఎంత వయసులో ఉన్నా కూడా.. ప్రోడక్ట్ పై పూర్తిగా అవగాహన పెంచుకునేందుకు నిరంతరం స్టడీ చేసేవారు.
- విమర్శలకు భయపడొద్దు:ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు కొంతమంది సపోర్ట్ చేయవచ్చు.. మరికొందరు వ్యతిరేకించవచ్చు.. వాస్తవానికి ఒక విషయం ఏంటంటే.. మంచి చేసిన అంటారు.. చెడు చేసిన అంటారు.. ఏం చేయకపోయినా అంటారు.. అలాంటప్పుడు విమర్శలను పట్టించుకోకుండా చేసుకుంటూ ముందుకు వెళితేనే బెటర్ అని ధనవంతులు చెబుతుంటారు. అందుకే చాలామంది ఎవరెన్ని విమర్శలు చేసినా.. వారు పట్టించుకోకుండా ముందుకు వెళ్తారు.
- వెంటనే ప్రతిస్పందించడం: మీరు ఏదైనా ఒక పని చేయాలని అనుకుంటే దానిని వెంటనే అమలు చేయడం చాలా అవసరం. ఉదాహరణకు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే.. ఆ ఐడియా ఇంకొకరికి వచ్చే అవకాశాలుంటాయి. దీంతో మీరు వెనుకబడి అవకాశాలుంటాయి. అందువల్ల ఒక పనిని పూర్తి చేయడానికి వెంటనే యాక్షన్ తీసుకోవడం చాలా అవసరం.
- ఒప్పందాలు నిలబెట్టుకోవడం: చాలామంది ఒక వస్తువును తక్కువ ధరకు ఇస్తామని లేదా మరికొన్ని రోజుల్లో ఆఫర్ ప్రకటిస్తామని చెబుతూ ఉంటారు.. కానీ ఆ తర్వాత దాని గురించి పట్టించుకోరు. ఈ విషయంలో వినియోగదారులు ఒక్కసారి నిరాశ చెందుతే.. మరోసారి ఆ సంస్థ వైపు చూడరు. అందువల్ల ఏదైనా ఒప్పందాన్ని చేస్తే దానిని కచ్చితంగా అమలు చేయాలి. అప్పుడే సంస్థ లేదా కంపెనీ పై నమ్మకం ఏర్పడుతుంది.
- కొత్త విషయాలు నేర్చుకోవడం: బిల్ గేట్స్ వంటి వారు ఎంత ఎదిగినా కూడా నిత్యం పుస్తకాలు చదువుతూనే ఉంటారు. ఎందుకంటే కొత్త విషయాలు నేర్చుకోవడం వారి హాబిట్. ఎందుకంటే కొత్త విషయాలతో వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఎప్పటికప్పుడు అప్డేట్ కావచ్చు. దీంతో ఎలాంటి కష్టం లేకుండా ముందుకు వెళ్లొచ్చు.
ఈ సూపర్ 5 టిప్స్ ఫాలో అయితే ఎవరైనా తమ జీవితంలో ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.