Homeజాతీయ వార్తలుAvocado Benefits : మోడీ తినమన్నారు.. సీన్ కట్ చేస్తే ఆ ఫ్రూట్ బిజినెస్ కోట్లు

Avocado Benefits : మోడీ తినమన్నారు.. సీన్ కట్ చేస్తే ఆ ఫ్రూట్ బిజినెస్ కోట్లు

Avocado Benefits : నరేంద్ర మోడీ.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటున్నారు. రకరకాల వీడియోలను ఆయన పోస్ట్ చేస్తున్నారు. యువతరానికి ఆయన దగ్గర కావడానికి మరింత ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా జెన్ జెడ్ కోపాన్ని చల్లార్చుతున్నారు. తాజాగా నరేంద్ర మోడీ Instagram లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నరేంద్ర మోడీ రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఇతర వ్యవహారాల గురించి చర్చించలేదు. జస్ట్ ఒక పండు గురించి చెప్పారు. […]

Avocado Benefits : నరేంద్ర మోడీ.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటున్నారు. రకరకాల వీడియోలను ఆయన పోస్ట్ చేస్తున్నారు. యువతరానికి ఆయన దగ్గర కావడానికి మరింత ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా జెన్ జెడ్ కోపాన్ని చల్లార్చుతున్నారు.

తాజాగా నరేంద్ర మోడీ Instagram లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నరేంద్ర మోడీ రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఇతర వ్యవహారాల గురించి చర్చించలేదు. జస్ట్ ఒక పండు గురించి చెప్పారు. అది కూడా అవకాడో పండు గురించి.. ఆ పండు తింటే ఆరోగ్యం బాగుంటుందని ఆయన చెప్పుకొచ్చారు.. వాస్తవానికి నరేంద్ర మోడీ చెప్పిన ఆ పండు మనదేశంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే పండుతుంది. ఇటీవల కాలంలో ఔత్సాహిక రైతులు ఆ పంటను సాగు చేస్తున్నారు. కాకపోతే దిగుబడి గొప్పగా రావడం లేదు.

అవకాడో వెస్ట్రన్ దేశాలలో విపరీతంగా పండుతూ ఉంటుంది. అమెరికా నుంచి మొదలు పెడితే రష్యా వరకు చాలా దేశాలు ఈ పండును ఇతర దేశాలకు ఎగమతి చేస్తూ ఉంటాయి. అవకాడో పండు మార్కెట్ విలువ కోట్లలో ఉంటుంది. ఒక నివేదిక ప్రకారం పాశ్చాత్య దేశాలకు సంబంధించిన వారు అవకాడో పండును బ్రేక్ఫాస్ట్.. డిన్నర్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. పార్టీలు జరిగినప్పుడు ఈ పండుతో రకరకాల వంటకాలు చేసుకొని ఆస్వాదించుకుంటూ తింటారు.

అవకాడో పందులు యాంటీ యాక్సిడెంట్లు.. లైకో పీస్.. బీటా కెరోటిన్ వంటివి విపరీతంగా ఉంటాయి. అవకాటిని బి అనే లిపిడ్ ఇందులో అధికంగా ఉంటుంది. ఇది ల్యూకేమియా కణాలను నాశనం చేస్తూ ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. ఈ పండు వాడటం వల్ల అల్జీమర్స్ వంటి రోగాలు రాకుండా ఉంటాయి.. అందువల్లే పాశ్చాత్య దేశాలకు సంబంధించిన వారు ఈ పండును విరివిగా తింటూ ఉంటారు. జన్ జెడ్ తరానికి అర్థమయ్యే విధంగా నరేంద్ర మోడీ ఆ వీడియోలో అవకాడో పండు గురించి చెప్పడం విశేషం. అయితే అవకాడో పంట ఉత్పత్తిని పెంచడానికి, సాగును ప్రోత్సహించడానికి కేంద్రం భారీగా కేటాయింపులు చేస్తుండటం విశేషం. మోడీ వీడియో ద్వారా ఈ పంట సాగు మనదేశంలో పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పంట సాగు చేసే రైతులకు భారీగా లాభాలు వస్తాయని చెబుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper