Homeఆధ్యాత్మికంToday 26 August 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు ఈరోజు ఏది ముట్టుకున్నా...

Today 26 August 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు ఈరోజు ఏది ముట్టుకున్నా బంగారమే..

Today 26 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు వృత్తిపరంగా అన్ని కలిసి వస్తాయి. కొత్తగా […]

Today 26 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు వృత్తిపరంగా అన్ని కలిసి వస్తాయి. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అధిక లాభాలు ఉంటాయి. అయితే కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కాస్త సంయమనం పాటించాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. శారీరక శ్రమ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): . ఈ రాశి వారు ఈరోజు మాటల తీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. అయితే ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఏమైనా సమస్యలు ఏర్పడితే వాటిని సున్నితంగా పరిష్కరించుకోవాలి. అనవసరపు మాటలతో ఇతరులను బాధ పెట్టవద్దు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు అదృష్టాన్ని కలిగి ఉంటారు. ఉన్నట్లుండే ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు కొత్తగా లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. పెద్దల ఆశీస్సులతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇతరులను ఆకట్టుకోవడానికి తమ మాట తీరును మెరుగుపరుచుకుంటారు. కొన్ని పనులు పూర్తి చేయడానికి ఇతరుల సహాయం తీసుకుంటారు. లక్ష్యాలను చేరెందుకు తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరికి ఊహించని అద్భుతాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉన్నా కూడా వీటిని వెంటనే పరిష్కరించుకుంటారు. బడ్జెట్కు అనుగుణంగా మాత్రమే ఖర్చు పెట్టాలి. అనవసరంగా ఇతరులను బాధ పెట్టడానికి ప్రయత్నించవద్దు. అ కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారికి ఈ రోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కష్ట సమయాల్లో స్నేహితుల సహాయం ఉంటుంది. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఉత్సాహంగా పనిచేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులు కొన్ని సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సమస్యలను సునాయాసంగా పరిష్కరించుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎదుటివారిని ఆకట్టుకునేందుకు మాటల తీరును మెరుగుపరుచుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. పోటి పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే అనుకూలమైన సమయం.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి మాట తీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుంది. గతం నుంచి ఇబ్బంది పడుతున్న కొన్ని ఆటంక పనుల నుంచి బయటపడతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు జీవితంలో అనేక మార్పులు ఉంటాయి. అవసరపు వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపుతారు. ఉద్యోగులకు అధికారుల సపోర్టు ఉండటంతో ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి శని దేవుడి అనుగ్రహం ఉండడంతో అన్ని అనుకూలంగా ఉంటాయి. అయితే కొన్ని నిరాశకరమైన వార్తలు వినాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఏ విషయంలోనైనా ఆశ్రద్ధగా ఉండకూడదు. ఉద్యోగులకు అవసరమైన ఆర్థిక వనరులను అందుతాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper