Homeఆంధ్రప్రదేశ్‌ap politics : నగరిలో పులిహోర.. ఆసుపత్రిలో వృద్ధులు!

ap politics : నగరిలో పులిహోర.. ఆసుపత్రిలో వృద్ధులు!

Roja Selvamani : కొందరు ఏం చేసినా వికటిస్తుంది. కొందరిపై కొన్ని రకాల ముద్ర చాటుకుంటూ వస్తుంది. మొన్నటికి మొన్న నేపాల్ లో విపత్తు రావడం వెనుక మాజీ మంత్రి రోజా ఉన్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరిగాయి. ఇటీవల వరదలకు నేపాల్ పూర్తిగా నేలమట్టం అయినంత పని అయింది. అయితే కొద్ది రోజుల కిందట మాజీ మంత్రి రోజా నేపాల్ వెళ్లిన ఫోటోలను జతచేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం నడిచింది. తాజాగా నగిరి […]

Roja Selvamani : కొందరు ఏం చేసినా వికటిస్తుంది. కొందరిపై కొన్ని రకాల ముద్ర చాటుకుంటూ వస్తుంది. మొన్నటికి మొన్న నేపాల్ లో విపత్తు రావడం వెనుక మాజీ మంత్రి రోజా ఉన్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరిగాయి. ఇటీవల వరదలకు నేపాల్ పూర్తిగా నేలమట్టం అయినంత పని అయింది. అయితే కొద్ది రోజుల కిందట మాజీ మంత్రి రోజా నేపాల్ వెళ్లిన ఫోటోలను జతచేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం నడిచింది. తాజాగా నగిరి లో జరిగిన ఓ కార్యక్రమంలో రోజా చేతులమీదుగా పులిహోర ప్యాకెట్ అందుకొని.. తిన్న వృద్ధుడు అస్వస్థతకు గురయ్యారంటూ మళ్లీ ప్రచారం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

* రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నాడు..
సెప్టెంబర్ 2న వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నగిరిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే ఇదే వేదికపై పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. అయితే అవి తిన్న కొంతమంది వృద్ధులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. అయితే రోజా విషయంలో ఇలా ప్రచారం జరగడం కొత్త కాదు. ఆమె ఎక్కడకు వెళ్లినా.. ఏం చేసినా.. వెనుక ఏదైనా అనుకోని ఘటనలు చోటు చేసుకుంటే.. ఆమెకు జతచేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో జరిగే ప్రచారం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే రాజకీయంగా దూకుడు కలిగిన రోజా విషయంలో వ్యతిరేకులు కూడా అదే స్థాయిలో ఉన్నారు. అందుకే ఆమె నిత్యం ట్రోల్స్ కు గురవుతుంటారు.

* దూకుడు కలిగిన నేత..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు కలిగిన నేతల్లో రోజా ఒకరు. అయితే ఆమె రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటారు. అందుకే ఆమె సైతం వ్యక్తిగతంగా టార్గెట్ కు గురవుతుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా జరిగే ప్రచారం అంతా ఇంతా కాదు. మొన్నటికి మొన్న తమిళనాడు ఎన్నికల సమయంలో ఆమె డిఎంకెకు మద్దతుగా ప్రచారం చేశారు. టీవీకే విజయ్ గెలవడంతో ప్లేట్ ఫిరాయించారు. జగన్మోహన్ రెడ్డి మద్దతుతోనే విజయ్ గెలుపొందాడు అంటూ చెప్పుకొచ్చారు. అప్పుడు కూడా ట్రోల్స్ కు గురయ్యారు. మొన్న నేపాల్ వరదలకు మళ్లీ ఆమెను టార్గెట్ చేశారు నెటిజెన్లు. ఇప్పుడు నగిరి లో జరిగిన కార్యక్రమంలో ఆమె చేతుల మీదుగా పులిహోర తిన్న వృద్ధులు అస్వస్థతకు గురైనట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by TDP AT 175 (@tdpat175)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper