Today 30 july 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై ఉత్తరాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి శుభయోగాలు జరగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ప్రమోషన్ విషయంలో శుభవార్తలు అందుతాయి. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు కొన్ని రహస్యాలను ఇతరులకు చెప్పకూడదు. గతంలో మొదలుపెట్టిన పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు మెరుగని లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మిథున రాశి( మృగశిర 3,4 ): . ఈ రాశి వారికి ఈరోజు అన్ని శుభ ఫలితాలే ఉండనున్నాయి. శక్తి సామర్థ్యాల మేరకు ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గురువుల నుంచి సానుకూల ఫలితాలు ఉండడంతో విద్యార్థులు పోటీ పరీక్షలో రాణిస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా సాగుతుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రత్యేకంగా ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీ లాభాలు పొందుతారు. నాణ్యమైన సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు అనేక రంగాల్లో రాణిస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. గతంలో మొదలుపెట్టిన ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. దీంతో అప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. గతంలో ఆగిపోయిన డబ్బు ఇప్పుడు వసూలు అవుతుంది. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులు తోటి వారితో సంతోషంగా గడుపుతారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనులని మీతం బిజీగా ఉంటారు. ప్రముఖ వ్యక్తులను కలిసి అవకాశం ఉంది. దీంతో ఆర్థిక ప్రయోజనాలు కలిగి అవకాశం ఉంది. ఎవరైనా చెడు మాటలు చెప్తే దూరంగా ఉండటమే మంచిది. కోపాన్ని నియంత్రించుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అనేక రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. తీర్థయాత్రలకు వెళ్లాలని అనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారులకు అధిక ఆదాయం పెరుగుతుంది. వాహన కొనుగోలు విషయంలో ఆసక్తి చూపుతారు. అపరమైన విజయాలు సాధిస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి చూపుతారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సోదరులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. విహారయాత్రలకు వెళ్లి ఎందుకు ప్లాన్ చేస్తారు. ధన్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఇంట్లో సంతోషకరమైన వాతావరణముంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారులు కొత్తగా లాభాలు పొందుతారు. గతంలో చేపట్టిన పనులన్నింటిలో విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. స్నేహితుల సహకారంతో అప్పుల నుంచి బయటపడతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభయోగాలే జరగనున్నాయి. గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండడంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులకు పోవద్దు. పిల్లల కెరీర్ పై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.