Today 17 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై చిత్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అదృష్టం తలుపు తట్టనుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దీంతో కార్యాలయాల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు. అనుకున్న పనులను త్వరగా పూర్తి చేసుకోవడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో వ్యాపార అభివృద్ధిని చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగులకు అదనపు అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవాలి. కొన్ని సమయాల్లో మనోధైర్యమే కాపాడుతుంది.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు మాట తీరును మెరుగుపరుచుకోవాలి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో ఆర్థిక అభివృద్ధి ఉండే అవకాశం ఉంది. కార్యాలయాల్లో తోటి వారి సహకారం ఉంటుంది. వ్యాపారులు అదనపు పెట్టుబడులు పెడతారు. ఇంట్లో శుభకార్యం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉంటారు. మానసికంగా తృప్తిని పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు కొత్త బాధ్యతలను చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటమే మంచిది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు కార్యాలయాల్లో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. పెద్దల అండదండలతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. మార్కెటింగ్ రంగంలో ఉండే వారికి కలిసి వస్తుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అనవసరంగా డబ్బు ఇవ్వకుండా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ప్రశంసలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న పనులను త్వరగా పూర్తి చేయడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తను అందుతాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు అధిక ఆదాయాన్ని పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. అయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడితే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయాల్లో క్రమశిక్షణతో ఉంటేనే అధికారుల సపోర్టు ఉంటుంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం తలుపు తడుతుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఉత్సాహం చూపుతారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. పిల్లల ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు పూర్వీకులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం. అనవసరపు వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండాలి. దాంపత్య జీవితం మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు తగినంత విశ్రాంతి అవసరం. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాశి వారు ఈ రోజు కొత్త ఆలోచనలతో ఉత్సాహంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు అధిక ఆదాయాన్ని పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. ఉద్యోగులకు అనుకొని అదృష్టం వరిస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి తోటి వారి సహకారం ఉంటుంది. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కొత్త పెట్టుబడును పెడతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు నాణ్యమైన ఆహారాన్ని తీసుకుంటారు. ఉద్యోగులు నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. పిల్లల కెరీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.