Helicopter Wedding Procession: పెళ్లి తంతు మారింది. పెళ్లి అంటే జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చేది. ఆ జ్ఞాపకాలను కలకాలం దాచుకోవాలన్న ప్రయత్నంలో రకరకాల మార్పులు సంతరించుకుంటున్నాయి. ఒకప్పుడు ఫోటోలు, వీడియోలు తీయించుకొని వాటిని భద్రపరుచుకునేవారు. ఇప్పుడు ఆ పరిధి కూడా దాటింది. ఫోటోషూట్, ఫ్రీ వెడ్డింగ్ లు వచ్చేసాయి. పోనీ అంతటితో ఆగిందా అంటే అదీ లేదు. సరికొత్తగా హల్ది, మెహందీ సంస్కృతి సైతం వచ్చింది. వివాహ వేడుకలను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ వివాహాన్ని అందంగా చేసుకోవాలని ఆరాటం నేటి యువతలు పెరగడం విశేషం. ఇతరుల కంటే భిన్నంగా ఉండాలని తాపత్రయం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు ఎంత ఖర్చైనా వెనుకడుగు వేయడం లేదు. తాజాగా ఓ తండ్రి తన కుమారుడి వివాహాన్ని వినూత్నంగా జరిపించాడు. ఏకంగా వివాహ తంతులో హెలికాప్టర్ ను వినియోగించడం విశేషం.
* గుంటూరు జిల్లాలో..
గుంటూరు జిల్లా లూలుపురానికి చెందిన ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి సాయికుమార్ కు.. పల్నాడు జిల్లా అనుపాలెం గ్రామానికి చెందిన రాణి తో వివాహం జరిగింది. అయితే తన కుమారుడి వివాహం ప్రత్యేకంగా ఉండాలన్న తలంపుతో తండ్రి రూ.20 లక్షల ఖర్చు చేసి నవ దంపతుల కోసం హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేశాడు. వివాహం జరిగిన తర్వాత పసుపు దుస్తులతో నవ దంపతులు హెలికాప్టర్ ఎక్కి గ్రామంలో విహరించారు. ఆ తరువాత తమ బంధువులను హెలికాప్టర్ ఎక్కించి గ్రామం చుట్టూ 10 రౌండ్లు చక్కర్లు కొట్టించారు. వారిని మరింత సంతోషపరిచారు.
* సాధారణ కుటుంబం..
ఓ సాధారణ కుటుంబం పుల్లారావుది. వ్యవసాయ కుటుంబం. అయినా సరే తన కుమారుడి పెళ్లి 10 కాలాలపాటు అందరి నోటా నిలవాలంటే హెలిక్యాప్టర్ లో ఊరేగింపు ఆలోచన చేశారు. ఆర్టీసీ బస్సు కూడా రాని తమ గ్రామం హెలిక్యాప్టర్లో ఊరేగిస్తే అందరూ గొప్పగా చెప్పుకుంటారన్నది ఆయన భావన. అయితే 20 లక్షలు ఖర్చుపెట్టి ఈ పని చేయడానికి కొంత మొత్తం భూమిని కూడా అమ్మినట్లు పుల్లారావు చెబుతున్నారు. అయితే హెలిక్యాప్టర్ రావడంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో ఆనందం నెలకొంది. అంతకుమించి ఆసక్తి ఉంది. ప్రస్తుతం ఈ వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram