Homeఆంధ్రప్రదేశ్‌Bandla Ganesh Daughter Wedding: చంద్రబాబు రాక ఆలస్యం.. కుమార్తె పెళ్లి ఆపేస్తానన్న బండ్ల...

Bandla Ganesh Daughter Wedding: చంద్రబాబు రాక ఆలస్యం.. కుమార్తె పెళ్లి ఆపేస్తానన్న బండ్ల గణేష్!

Bandla Ganesh Daughter Wedding: ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కుమార్ అత్యంత ఘనంగా జరిగాయి. హైదరాబాదులో జరిగిన ఈ వివాహ వేడుకలకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ వివాహ వేడుకల్లో. అయితే ఏపీ సీఎం చంద్రబాబును చూసిన బండ్ల గణేష్ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రముఖులు హాజరైన క్రమంలో వారికి ఆత్మీయంగా ఆహ్వానం […]

Bandla Ganesh Daughter Wedding: ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కుమార్ అత్యంత ఘనంగా జరిగాయి. హైదరాబాదులో జరిగిన ఈ వివాహ వేడుకలకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ వివాహ వేడుకల్లో. అయితే ఏపీ సీఎం చంద్రబాబును చూసిన బండ్ల గణేష్ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రముఖులు హాజరైన క్రమంలో వారికి ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతూ చాలా ఉల్లాసంగా కనిపించారు బండ్ల గణేష్. కానీ ఏపీ సీఎం చంద్రబాబును చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

* ఘనంగా వివాహ వేడుకలు..
హైదరాబాదులోని జేఆర్సి కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుకలు జరిగాయి. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సినీ నటుడు చిరంజీవి, నాగార్జున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అన్నింటికీ మించి చంద్రబాబును చూడగానే బండ్ల గణేష్ భావోద్వేగానికి సంబంధించిన దృశ్యాలు ఎక్కువగా వైరల్ అవుతుండడం విశేషం.

* సార్ రాకుండా వివాహం వద్దు..
ఈ వివాహ వేడుకలకు ముందుగానే హాజరయ్యారు నారా భువనేశ్వరి. ఆమెకు ఆత్మీయంగా స్వాగతం పలికిన బండ్ల గణేష్ సార్ వచ్చేవరకు పెళ్లి జరగదు అంటూ చమత్కరించారు. సార్ వచ్చాక మాత్రమే పెళ్లి జరుగుతుందని వ్యాఖ్యానించడం విశేషం. చంద్రబాబు వచ్చిన తరువాత.. ఆయన చేతుల మీదుగా తాళి అందుకుని వరుడు సూర్యతేజ వధువు జనని మెడలో తాళి కట్టాడు. ఈ క్రమంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు బండ్ల గణేష్. దీంతో పక్కనే ఉన్న నటుడు బ్రహ్మాజీ ఆయనను ఊరడిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బండ్ల గణేష్ కు చంద్రబాబు కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.

* ప్రత్యేక అభిమానం..
ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు పట్ల తన అభిమానాన్ని చాటుకుంటూ వచ్చారు బండ్ల గణేష్. అప్పట్లో చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఎమోషనల్ అయ్యారు. చాలా బాధపడి వ్యాఖ్యానాలు చేశారు అప్పట్లో. మొన్ననే అందుకు సంబంధించి మొక్కు తీర్చుకున్నారు. హైదరాబాదు నుండి తిరుపతికి పాదయాత్రగా వెళ్లి మొక్కు తీర్చుకోవడం విశేషం. చంద్రబాబు పై అభిమానంతో బండ్ల గణేష్ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలోనూ ఆయన పేరు వేయించారు. ఆహ్వాన పత్రిక పై భాగంలో శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదాలతో అని రాయించడం అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు చంద్రబాబు దంపతుల చేతుల మీదుగా కుమార్తె వివాహం జరిపించి మరోసారి చంద్రబాబుపై తన అభిమానాన్ని నిరూపించుకున్నారు బండ్ల గణేష్.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper