spot_img
Homeఆధ్యాత్మికంToday 16 August 2025 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు అనుకోని అదృష్టం..

Today 16 August 2025 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు అనుకోని అదృష్టం..

Today 16 August 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. శనివారం ద్వాదశరాసులపై కృత్తికా నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కొన్ని రాజుల వారికి అనుకూలంగా ఉండనుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉండలు ఉన్నాయి. ఉద్యోగులు జీతాల పెరుగుదల విషయంపై శుభవార్తలు వింటారు. ఆస్తికి సంబంధించి విలువైన సమాచారం అందుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు కుటుంబ మద్దతు ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి కష్టపడాల్సి వస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. రాజకీయ నాయకులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అనుకోకుండా విహారయాత్రలకు వెళ్లాల్సి వస్తుంది. కొన్ని సమస్యల పరిష్కారానికి స్నేహితుల మద్దతు ఉంటుంది. వ్యాపారులు ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి విద్యార్థులు భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు పెద్దల సలహాతో కొత్త పెట్టుబడులు పెడతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని పనుల కారణంగా ఉద్యోగులు బిజీగా ఉంటారు. గతంలో చేపట్టిన పనులతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కోపాన్ని నియంత్రించుకోవాలి. లేకుంటే తీవ్ర నష్టం జరుగుతుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడతారు. వ్యాపారులు పెద్దల మద్దతు పొందడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. వాళ్ళ జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . వ్యాపార ప్రణాళికలో భాగంగా ఈరోజు తీవ్రంగా కష్టపడతారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులపై బిజీగా ఉంటారు. విద్యార్థులు పోడి పరీక్షలో పాల్గొనడానికి కష్టపడాల్సి వస్తుంది. కొన్ని పనుల వల్ల సమాజంలో గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాజు ఉద్యోగులకు ఈరోజు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొత్త వ్యక్తులకు ఆర్థిక వ్యవహారాలు చెప్పకుండా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంభాషణతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రణాళికల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. విద్యార్థుల కోసం తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు గతంలో అనుకున్న ఒక కలను నేర్చుకుంటారు. ఆరోగ్యం పై సానుకూల ప్రభావం ఉంటుంది. వ్యాపారులో కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దీంతో అనుకున్న దాని కంటే ఎక్కువ ఆదాయం ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. డబ్బు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. . ఈ రాశి వారు పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా.. తోటి వారి సాయంతో వాటిని పరిష్కరించుకుంటారు. అంకిత భావంతో పనిచేసిన వారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. మనసులోకి ప్రతికూల ఆలోచనలు రానీయకుండా చేయాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . . ఈ రాజు వారు కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే ఇలాంటి సమయంలో పెద్దలను సంప్రదించాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఏ రోజు ఉల్లాసంగా ఉంటారు. నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సంబంధించిన వివాదాలు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి. పోటీ పరీక్షలో పాల్గొనే వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు శుభకార్యంలో పాల్గొనవచ్చు. ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఇదే మంచి సమయం పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. విదేశాల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. గతంలో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెడతారు. దీంతో వ్యాపారులు అధికంగా లాభాలు పొందుతారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడానికి తోటి వారి సహాయం తీసుకుంటారు. బడ్జెట్ ప్రకారమే ఖర్చులు చేయాలి. అదనపు ఖర్చులు చేయడం వల్ల ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Modi Instagram Reel

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
AP MLC Elections

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...
Roja

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....
Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Oktelugu Epaper