Homeఆధ్యాత్మికంToday Horoscope Telugu 4.1.2026 : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మహర్దశ.. లక్ష్మీదేవి అనుగ్రహంతో...

Today Horoscope Telugu 4.1.2026 : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మహర్దశ.. లక్ష్మీదేవి అనుగ్రహంతో లాభాలే లాభాలు..

Today Horoscope Telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు వ్యాపారులకు కుటుంబ సభ్యుల అండదండలు ఎక్కువగా ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు ముఖ్యమైన పనులు పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి నిరుద్యోగులు ఈరోజు శుభవార్తలు వింటారు. ఏదైనా కొత్త ఆస్తి కొనాలనుకుంటే ఇదే మంచి సమయం. కుటుంబ వ్యవహారాల్లో ఓపికగా ఉండాలి. విభేదాలను వెంటనే పరిష్కరించుకోవాలి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కీలక పెట్టుబడులు పెడతారు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మధ్యత ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. విద్యార్థులకు గురువుల నుంచి ప్రోత్సాహం అందుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పిల్లలకి కెరీర్ పై తల్లిదండ్రులకు కీలక నిర్ణయం తీసుకుంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. గతంలో చేసిన కొన్ని పనులు ఇప్పుడు లాభాలు తెస్తాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మధ్యత ఉంటుంది. దీంతో గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఎవరితోనూ వాగ్వాదానికి దిగకుండా ఉండాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టంగా మారుతుంది. అయినా కూడా వాటిని పూర్తి చేసే వరకు విస్మరించరు. కోర్టు కేసుల నుంచి విముక్తి కలుగుతుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. దీంతో ఉద్యోగులు అధికారంలో నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. విదేశాలతో వ్యాపారం చేసేవారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేయడానికి ప్లాన్ చేస్తారు. అయితే ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ పైకి కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈరోజు వ్యాపారులకు ఈరోజు భాగస్వాముల అండదండ ఉండడంతో లాభాలు అధికంగా పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వదు. ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. నిరుద్యోగులకు అనుకున్న అవకాశాలు అందుతాయి. ఉద్యోగులు తోటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) :. ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. దీంతో ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. సమాజంలో గుర్తింపు రావడంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల అండ ఉంటుంది. దీంతో అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు నూతన ఉత్సాహంతో కొత్త పెట్టుబడులు పెడతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కెరీర్ విషయంలో ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేయాలని అనుకుంటే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారం ఈరోజు ఆన్లైన్లో పెట్టుబడులు పెడతారు. విద్యార్థులు శుభవార్తలు విని అవకాశం ఉంటుంది. వ్యాపారులు కొత్తగా భాగస్వాములను చేర్చుకుంటారు. కుటుంబంతో కలిసి వ్యాపారం చేసే వారికి ఈరోజు అధిక లాభాలు పొందుతారు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . . ఈరోజు వారు కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే పెద్దలను సంప్రదించడం మంచిది. వ్యాపారులకు గతంలో కంటే ఎప్పుడు మెరుగైన లాభాలు వస్తాయి. పోటీ పరీక్షలో రాణించడానికి విద్యార్థులు తల్లిదండ్రుల సహాయం తీసుకుంటారు. జీవిత భాగస్వామికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper