Revanth Reddy : ఒక విషయాన్ని వినసొంపుగా చెప్పాలంటే .. ఏదో ఒక లాజిక్ ను దానికి జత చేయాలి. కాస్త కామెడీని మిక్స్ చేయాలి. చదువుతుంటే ఇదేంటి సినిమా స్క్రిప్ట్ ఎలా రాయాలో చెబుతున్నారా.. అనే అనుమానం మీకు వస్తోంది కదూ.. ఈ కథనం చదివేయండి.. మీకే ఒక క్లారిటీ వస్తుంది..
ఒకప్పుడు రాజకీయాలు విషయానుసారంగా ఉండేవి. ఆ తర్వాత విషయం పక్కకు వెళ్లిపోయి వ్యక్తిగత విమర్శల స్థాయికి దిగజారింది. ఇప్పుడు ఏకంగా బూతులు.. తోలు తీయడం.. నాలుక కోయడం వరకు వెళ్లిపోయాయి. భవిష్యత్తు కాలంలో ఎక్కడ దాకా వెళ్తాయో గాని.. రాజకీయాలు ఏమాత్రం బాగోలేవు. వచ్చే రోజుల్లో బాగుపడతాయనే నమ్మకాన్ని కలిగించట్లేవు.
మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి.. ప్రజలే ప్రభువులు కాబట్టి.. ప్రజలు ఓట్లు వేస్తేనే నాయకులకు గెలుస్తున్నారు కాబట్టి.. ఆ నాయకులు కూడా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు కాబట్టి.. డబ్బులు తీసుకున్న పాపానికి ఐదు సంవత్సరాలపాటు నాయకులు ఏం చేస్తే అది చూడాలి. ఏది చెబితే అది వినాలి.. అంతేతప్ప ఇష్టానుసారంగా మాట్లాడితే.. ఎదురు ప్రశ్నిస్తే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సి ఉంటుంది..
ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా ఈసారి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బి ఆర్ ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో రేవంత్ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.” ఒక లీడర్ ను పైనుంచి ఎవడో కాలుస్తాడు. ప్రతి నేరగాడికి ఒక ఫ్యాటర్ను ఉంటుంది. అందుకే ఎంక్వైరీ కి వచ్చేసి సిబిఐ ఆఫీసర్ ఈ విధానంలో ఎవడు హత్య ఉంటుండొచ్చునని జైలలో పాత క్రిమినల్స్ ను ఆరా తీస్తాడు.. జేబులు కొట్టేవారికి.. చైన్లు దోచేవాడికి.. ఇలా ప్రాజెక్టులు అంచనాలు పెంచి దోపిడీ చేసే వారికి ఒక విధానం ఉంటుందని” రేవంత్ రెడ్డి కెసిఆర్ ను ఉద్దేశించి విమర్శించారు..
సహజంగా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందువల్లే పాలమూరు రంగారెడ్డి పథకానికి సంబంధించి ఏం జరిగిందనే విషయాన్ని ప్రజలు సులువుగా అర్థం చేసుకునే విధంగా అతడు స్టోరీని చెప్పారు. అంతేకాదు, తెలంగాణ ప్రయోజనాలకు అడ్డంపడితే.. ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే నాలుక కోస్తామని రేవంత్ హెచ్చరించారు..