Rajasthan: నేటి కాలంలో పెళ్లి కాని వారు చాలామంది ఉన్నారు. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రమని తేడా లేదు. అన్ని ప్రాంతాలలో ఇదే పరిస్థితి. గొప్ప గొప్ప చదువులు ఉన్నప్పటికీ.. పేరుపొందిన ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ చాలామందికి వివాహాలు కావడం లేదు. దీంతో వారు పడుతున్న ఇబ్బంది మామూలుగా లేదు. ఫలితంగా పెళ్లి చేసుకోవడానికి యువకులు చేయని ప్రయత్నం అంటూ లేదు.
ప్రసాదం తింటే పెళ్లి జరుగుతుందట
మనదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క నేపథ్యం ఉంది. ప్రస్తుతం గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మనదేశంలో పేరుపొందిన గణపతి ఆలయాలలో రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో ఉన్న మోతీ డుంగ్రి గణేష్ ఆలయం ఒకటి. గణపతి నవరాత్రి ఉత్సవాల సమయంలో ఈ ఆలయానికి లక్షలాదిమందిగా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడి స్వామి వారి ప్రసాదానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.. స్వామివారి ప్రసాదం తింటే పెళ్లి జరుగుతుందని యువకులను నమ్ముతూ ఉంటారు. పైగా స్వామి వారి ప్రసాదంగా ఇచ్చే మెహందీని పూసుకుంటే పెళ్లికాని వాళ్లకు పెళ్లి జరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు.
వినాయక చవితి నేపథ్యంలో ఈనెల 13 నుంచి మధ్యప్రదేశ్.. ఉత్తర ప్రదేశ్.. హర్యానా.. గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వచ్చారు. గడిచిన శనివారం 3500 కిలోల మెహందీని పంపిణీ చేస్తే.. కేవలం మూడు గంటల్లోనే అయిపోయిందని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. యువత మెహందీ కోసం బారులు తీరిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
“నేటి కాలం వివాహాలు జరగకుండా చాలామంది యువకులు ఉన్నారు. వారంతా కూడా తమ జీవితంలో ఒక కల్యాణ గడియ ఉండేలాగా చూసుకుంటున్నారు. అన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ విఫలం కావడంతో.. చివరికి గణపతిని ఆశ్రయిస్తున్నారు. గణపతి మెహందీ ని పూసుకుంటున్నారు. తమ జీవితంలో కళ్యాణ యోగాన్ని ప్రాప్తించాలని స్వామివారిని వేడుకుంటున్నారు. స్వామి గనుక వీరి మీద కరుణ కటాక్షాలు ప్రదర్శిస్తే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. ఏ మనిషికైనా జీవితంలో ఒక తోడు ఉండాలని” ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.
ఆలయ చరిత్ర
- మోతి డుంగ్రీ గణేష్ ఆలయాన్ని 1761 లో మహారాజా మాధో సింగ్ పరిపాలన కాలంలో సేథ్ జయరాం పలివాల్ ఆధ్వర్యంలో నిర్మించారు.
- ఇక్కడ వినాయక విగ్రహానికి దాదాపు 500 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉంది. నాటి ఉదయపూర్ రాజు ఒక ఎడ్ల బండి మీద ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారు. ఆ బండి మోతి డూండీ కొండపైకి వచ్చి ఆగింది. బండి ఆగినచోట ఆలయం నిర్మించాలని నాడు రాజు నిర్ణయించుకున్నారు.
- ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం కూర్చున్న భంగిమలో.. కుడి వైపుకు తిరిగిన తొండంతో దర్శనమిస్తారు. తొండం సింధూర వర్ణంలో ఉంటుంది.
- ఇక్కడి ప్రజలు తమ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు లేదా వివాహాలు జరిగినా మొదటి పత్రికను స్వామివారి ఆలయంలో సమర్పిస్తారు. ఈ ఆలయం నాగార శైలి లో నిర్మితమైంది. ఇక్కడ మూడు మతాల సామరస్యానికి గుర్తుగా మూడు గోపురాలు నిర్మించారు.
- ఆలయం గోపురం మీద అందమైన పౌరాణిక చిత్రాలు ఉంటాయి. మార్బుల్ జాలి పనుల వల్ల ఇక్కడి ప్రాంతం చూడ ముచ్చటగా ఉంటుంది. ఈ ఆలయం పక్కన విఖ్యాతమైన బిర్లా మందిర్ ఉంది.
Desire for marriage, huge crowd gathered in Jaipur
A huge crowd gathered at Jaipur’s Moti Dungri Temple to receive henna for the Sinjara Festival. The situation became so intense that the police had to pacify the crowd and announce that the henna had run out, urging… pic.twitter.com/oyovm2EklV
— Sunil Goriya (@Sunil_Goriyaa) September 14, 2026