Madhuri Rathod: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా మనకి మాధురి రాథోడ్ పేరే వినిపించింది. ఈశ్వర్ సాయి తో ఒక గదిలో ఉన్నపుడు అతని భార్య శరణ్య రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళిద్దరిని పట్టుకోవడం, ఆ తర్వాత ఈశ్వర్ సాయి పరార్ అవ్వడం, దీంతో మాధురి రాథోడ్ అతను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ కేసు వేయడం , ఆ కేసులో ఈశ్వర్ కి బెయిల్ వచ్చిందనే విషయం తెలుసుకొని మాధురి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం వంటి సంఘటనలు పెద్ద దుమారమే రేపింది. జరిగిన ఆ సంఘటనల నుండి బయటకు రావడం చాలా కష్టం , ఇక మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి కెరీర్స్ ముగిసిపోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ వీళ్లిద్దరు ఇప్పుడు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కం బ్యాక్ ఇచ్చారు.
రెండు రోజుల క్రితమే ఈశ్వర్ సాయి తన కొత్త పాటకు సంబంధించి ప్రెస్ మీట్ ని నిర్వహించాడు. ఇక రీసెంట్ గానే మాధురి రాథోడ్ ‘బిందెలు బిందెలు బావయ్య’ అనే ఫోక్ సాంగ్ చేసింది. ఈ పాటకు సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసింది. దీనికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కష్టమైన పరిస్థితులను అధిగమించి మాధురి రాథోడ్ ఇలా కం బ్యాక్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియా లో ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు, ఇంతముందు పాటల్లో ఆమె ఎంతటి జోష్ తో డ్యాన్స్ వేసేడో అదే రేంజ్ జోష్ ఈ పాటలో కూడా కనిపించింది. ఇదంతా పక్కన పెడితే ఈశ్వర్ సాయి తో ఆ సంఘటన జరగక ముందు మాధురి రాథోడ్ అతనితో కలిసి ఒక ఫోక్ చేసింది.
ఈ పాట కూడా మూడు రోజుల్లో విడుదల కాబోతుంది. ఈ పాటపై మాత్రం ఇప్పటి వరకు మాధురి రాథోడ్ ఒక్క పోస్ట్ కూడా వెయ్యలేదు. దీన్ని బట్టీ ఆమెకు ఈశ్వర్ సాయి అంటే ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ పాట వీళ్లిద్దరి జీవితాలను కుదిపేసిన సంఘటన తర్వాత విడుదల కాబోతుంది కాబట్టి కచ్చితంగా వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్ కి మొదటి నుండే మంచి క్రేజ్ ఉంది. భవిష్యత్తులో మళ్లీ వీళ్లిద్దరు కలిసి ఒక సాంగ్ చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఇక అది దాదాపుగా అసాధ్యమే అని చెప్పొచ్చు. మూడు రోజుల తర్వాత విడుదలైనా ఫోక్ సాంగ్ , వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే చివరి సాంగ్ అని అనుకోవచ్చు.