Ganesh Chaturthi Pakistan: పాకిస్తాన్లో ఎక్కువ శాతం మసీదులు మాత్రమే ఉంటాయి. అక్కడ ముస్లిం మతం మెజారిటీగా ఉంటుంది. హిందువులను అక్కడ మైనారిటీగా చూస్తుంటారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో హిందువులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. అందువల్లే అక్కడి ప్రజలు ఈ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకోవాలని.. లేదా తమను భారతదేశంలో కలపాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగినప్పుడు నిరసనలు కూడా జరిపారు. అయితే ఇప్పుడు గణపతి చెవిటి ఉత్సవాలను అక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కాదు.. పాకిస్తాన్ దేశంలో అత్యంత కీలకమైన కరాచీనగరంలో దర్జాగా వేడుకలు జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
Also Read: ‘సింగర్ ఆఫ్ ది ప్యారడైజ్’ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
అప్పట్లో బాలగంగాధర తిలక్ దేశ స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు గణపతి చవితి ఉత్సవాలను దానికి అనుగుణంగా ఉపయోగించుకున్నారు. ప్రజలను ఏకం చేయడానికి.. స్వాతంత్ర్య సంగ్రామంలో పాలుపంచుకునేలా చేయడానికి గణపతి నవరాత్రి వేడుకలను ఆయన ఒక ఆయుధంగా వాడుకున్నారు. ఇప్పుడు బాలగంగాధర తిలక్ స్ఫూర్తితోనే పాకిస్థాన్లో ఉన్న హిందువులు గణపతి వేడుకలను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. కరాచనగరంలో ఎన్నడు లేని విధంగా హిందువులు గణపతి నవరాత్రి వేడుకలను జరుపుకుంటున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశమైనప్పటికీ.. అక్కడ రకరకాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా హిందువులు గణపతి పండుగను చేసుకోవడం విశేషం.
వాస్తవానికి పైకి ఇవి నవరాత్రి వేడుకలు మాదిరిగానే కనిపిస్తున్నప్పటికీ.. అక్కడ ప్రభుత్వం తీరు పట్ల.. అక్కడి పరిపాలకుల పట్ల ప్రజలలో ఉన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కరాచీ నగరంలో ఏర్పాటుచేసిన మండపానికి వేలాదిమంది భక్తులు తరలి రావడం.. అక్కడ వినాయకుడు జననంపై నాటకాన్ని ప్రదర్శించడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో.. నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. భక్తికి హద్దులు ఉండవంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు చైతన్యాన్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదని పేర్కొంటున్నారు. అంటే ఇదే తీరుగా నిరసనలు ఆ దేశంలో తీవ్రమైతే పరిపాలకులు తలవంచడం ఖాయమని కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు.
Watch : Ganesh Chaturthi vibes in Pakistan! Truly heartwarming to witness. pic.twitter.com/29U5C05k6V
— Hinduism_and_Science (@Hinduism_sci) August 29, 2025