Khairatabad Ganesh: ఖైరతాబాద్ ప్రాంతంలోని గణపతిని బడా గణేష్ అని పిలుస్తుంటారు. ఇక్కడ ప్రతి ఏడాది రికార్డు స్థాయి ఎత్తులో గణపతి ప్రతిమను తయారు చేస్తుంటారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇక్కడ ప్రారంభ పూజలు చేస్తుంటారు. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రులు.. ఎమ్మెల్యేలు.. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుంటారు.
ఖైరతాబాద్ మహాగణపతిని తయారు చేయడం నుంచి మొదలు పెడితే ఉత్సవాల వరకు ప్రతిదీ పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. దీని వెనక ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్వాహకులు ప్రతి ఏడాది గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. పైగా నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం కూడా తన వంతు తోడ్పాటు అందిస్తూ ఉంటుంది. అందువల్లే గణపతి నవరాత్రి ఉత్సవాలు ఖైరతాబాద్ ప్రాంతంలో ఈ స్థాయిలో ఘనంగా జరుగుతూ ఉంటాయి.
ఖైరతాబాద్ గణపతిని ప్రత్యేకమైన రూట్ మ్యాపు ద్వారా నిమజ్జనానికి తరలిస్తూ ఉంటారు. ఉదయం 6 గంటలకే ఖైరతాబాద్ గణపతి నిమజ్జన యాత్ర మొదలవుతుంది. ప్రత్యేకమైన టస్కర్ ఏర్పాటు చేసి. దాని మీదుగా గణపతిని తరలిస్తూ ఉంటారు. ఖైరతాబాద్ నుంచి మొదలుపెడితే ట్యాంక్బండ్ వరకు ఎక్కడా కూడా ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారు. రూట్ మ్యాప్ ను నిత్యం పోలీసులు పర్యవేక్షిస్తూ ఉంటారు. భక్తులు తండోపతండాలుగా రాకుండా ఉండడానికి.. పకడ్బందీగా నియంత్రణ విధానాలను పాటిస్తూ ఉంటారు.
ఖైరతాబాద్ గణపతిని బడా గణేష్ అని పిలుస్తుంటారు. ఈయనను దర్శించుకుంటే కోరిన కోరికల మొత్తం నెరవేరుతాయి అని భక్తులు నమ్ముతుంటారు. అయితే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి ఏర్పాటుచేసే టస్కర్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఖైరతాబాద్ గణేష్ టస్కర్ నడిపే వ్యక్తి మీద స్వామివారి కరుణాకటాక్షాలు మెండుగా ఉంటాయి. ఎందుకంటే ఈ టస్కర్ నడిపే వ్యక్తి గడిచిన నాలుగేళ్లలో ఇల్లు.. స్థలం కొనుగోలు చేశాడు. అంతేకాదు ఇదంతా కూడా గణేశుడి దయవల్ల జరిగిందని చెబుతున్నాడు. టస్కర్ నడపక ముందు అతడు ఆర్థికంగా ఇబ్బంది పడేవాడు. ఎప్పుడైతే ఖైరతాబాద్ గణపతి టస్కర్ నడపడం మొదలు పెట్టాడో అతడి జీవితం మారిపోయింది. ఆర్థికంగా బలోపేతమయ్యాడు. ఇంటి స్థలం.. ఇల్లు కొనుగోలు చేశాడు. ఇదే విషయాన్ని అతను గర్వంగా చెబుతున్నాడు.
“నేను ఖైరతాబాద్ మహాగణపతి టస్కర్ నడపడం మొదలు పెట్టిన తర్వాత జీవితం మారిపోయింది. ఆర్థికంగా స్థిరపడ్డాను. ఇల్లు కొనుగోలు చేశాను. ఇంటి స్థలం కూడా కొనుగోలు చేశాను. ఖైరతాబాద్ గణపతి టస్కర్ నడపడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇంతకంటే అదృష్టం మరొకటి ఉండదని” టస్కర్ నడిపే డ్రైవర్ వ్యాఖ్యానించాడు.
ఖైరతాబాద్ గణేష్ టస్కర్ నడపటాన్ని అదృష్టంగా భావిస్తున్నాం…
ఈ 4 ఏళ్లలో ఒక ఇల్లు,స్థలం కొన్నాం…
ఆ దేవుడి దయ చాలా కలిసొచ్చింది.. – టస్కర్ నడిపే వ్యక్తి #KhairtabadGanesh #GaneshImmersion #RTV pic.twitter.com/6DxuxvrCSi
— RTV (@RTVnewsnetwork) September 25, 2026