Nandi, Lord Shiva: మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నందీశ్వరుడిని దర్శించుకుంటాం. అలాగే నంది చెవిలో ఏవైనా కోరికలు చెబితే వెంటనే తీరుతాయని అంటుంటారు. నందీశ్వరుడు లేని శివాలయం ఎక్కడ కనిపించదు. అసలు నందీశ్వరుడు ఎవరు? ఆయన శివుడికి వాహనంగా ఎందుకు మారాల్సి వచ్చింది? వృషభం రూపం నందీశ్వరునికి ఎవరు ఇచ్చారు? ఈ ఆసక్తికరమైన కథ మీకోసం..
హిందూ పురాణాల్లో త్రిమూర్తుల్లో ఒకరైన మహాశివుడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. భక్తుల కోరికలను వెంటనే తీర్చే బోలా శంకరుడిని నిత్యం పూజిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా పూర్వకాలంలో శిలాధుడు అనే మహర్షి నిత్యం శివరామ స్మరణం లోనే ఉండేవాడు. తన జన్మ మొత్తం శివుడికి అంకితం అన్నట్లు భావించేవాడు. తనకు జీవితంలో ఎలాంటి కోరికలు లేవని కానీ ఒక ప్రశ్న మిగిలి ఉందని భావించేవాడు. ఎందుకంటే ఎన్నో వేదాలు, విద్య, పాండిత్యం నేర్చుకున్న ఆయన తన జ్ఞాన సంపాదనను మరొకరికి పంచాలని కోరికను కలిగినాడు. ఇందుకోసం వారసుడు కావాలని అనుకున్నాడు.
ఇందులో భాగంగా హిమాలయాల్లోకి వెళ్లి శిలాధుడు అత్యంత కఠినమైన తపస్సును చేశాడు. ఈయన తపస్సుకు మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు. దీంతో తనకు పుత్రుడు కావాలని అడగగా శివుడు అనుగ్రహిస్తాడు. కొన్ని రోజుల తర్వాత యజ్ఞభూమిని తయారు చేస్తున్న సమయంలో ఒక దివ్యమైన బాలుడు శిలాధుడికి కనిపిస్తాడు. ఈ బాలుడు ఆ మహా శివుడి వరమే అని అనుకొని అతడిని చేరదీస్తాడు. అతడికి నంది అని పేరు పెడతాడు.ఆ తర్వాత తనకు జ్ఞానాన్ని బోధిస్తాడు. అయితే ఎనిమిదేళ్ల వయసులోనే నందీశ్వరుడు అపారమైన జ్ఞానాన్ని పొందుతాడు.
అయితే నందీశ్వరుడు కూడా మహా శివ భక్తుడిగా మారుతాడు. నిత్యం శివనామ స్మరణంలోనే ఉండాలని అనుకుంటాడు. ఇందుకోసం నందీశ్వరుడు హిమాలయాల్లోకి వెళ్లి కఠినమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సు, పట్టుదలను మీ చిన్న శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు నందీశ్వరుడు తనకేం కోరికలు వద్దని తన జీవితం మొత్తం మీ పాదాల వద్ద సేవ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరుతాడు. దీంతో శివుడు నందీశ్వరుడి కోరికను నెరవేస్తాడు. అయితే శివుడు తన శూలం ద్వారా వచ్చే కాంతిని నందీశ్వరునిపై వేయగా.. అప్పటివరకు ఉన్న మానవ రూపం నుంచి నందీశ్వరుడు వృషభరూపంలోకి మారతాడు. ఈ సందర్భంగా శివుడు నందీశ్వరుడికి కొన్ని విషయాలను చెబుతాడు.. తన గుణ గణాల నుంచి కొన్నిటిని నందీశ్వరుడికి ప్రసాదిస్తున్నట్లు.. ఇకనుంచి నా దర్శనం కావాలంటే ముందుగా నిన్ను దర్శించుకోవాలని చెబుతాడు. అంతేకాకుండా కైలాసానికి క్షేత్రపాలకుడిగా నందీశ్వరుడని నియమిస్తాడు. ఇక్కడికి ఎవరైనా రావాలంటే ముందుగా నందీశ్వరుని అనుమతి తీసుకోవాలని శివుడు చెబుతాడు
ఆ విధంగా శిలాధుడి తపస్సు కారణంగా నందీశ్వరుడి జననం.. ఆ తర్వాత మహా శివుడి వద్ద ఉండడానికి కారణం అయింది. అయితే నందీశ్వరుని చెవిలో కోరికలు చెబితే తీరుతాయని అంటుంటారు. ఎందుకంటే మహాశివుడు నిత్యం ధ్యానంలో మునిగిపోతాడు. ఈ సమయంలో శివుడి ధ్యానానికి భంగం కలిగిస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అందువల్ల తమ కోరికలను నందీశ్వరుడికి చెబితే ఆ కోరికలను శివుడికి చేరవేరుస్తారని భక్తులు నమ్ముతారు.