Homeవింతలు-విశేషాలుMount Kailash: శివుడు కొలువై ఉండే కైలాస శిఖరం.. ఇంత అందంగా ఉంటుందా.. వైరల్ వీడియో

Mount Kailash: శివుడు కొలువై ఉండే కైలాస శిఖరం.. ఇంత అందంగా ఉంటుందా.. వైరల్ వీడియో

Mount Kailash: హిమాలయ పర్వతశ్రేణిలో కైలాస పర్వతానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే హిమాలయాలను అధిరోహించేవారు కైలాస పర్వతానికి చేరుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. ఎంతటి పర్వతారోహకులకైనా కైలాస పర్వతం అత్యంత కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గాలి అంతగా ఉండదు. మంచు దట్టంగా కురుస్తూ ఉంటుంది. పైగా ఒత్తిడి విపరీతంగా ఉండటం వల్ల కొన్ని సందర్భాలలో శరీరంలో రక్తం గడ్డకట్టుకుపోయి మరణం సంభవించే అవకాశం ఉంటుంది. హిమాలయ పర్వత […]

Mount Kailash: హిమాలయ పర్వతశ్రేణిలో కైలాస పర్వతానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే హిమాలయాలను అధిరోహించేవారు కైలాస పర్వతానికి చేరుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. ఎంతటి పర్వతారోహకులకైనా కైలాస పర్వతం అత్యంత కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గాలి అంతగా ఉండదు. మంచు దట్టంగా కురుస్తూ ఉంటుంది. పైగా ఒత్తిడి విపరీతంగా ఉండటం వల్ల కొన్ని సందర్భాలలో శరీరంలో రక్తం గడ్డకట్టుకుపోయి మరణం సంభవించే అవకాశం ఉంటుంది.

హిమాలయ పర్వత శ్రేణిలో కైలాస శిఖరం అత్యున్నతమైనది. హిందువులు కైలాస పర్వతాన్ని శివుడి నివాసస్థానంగా భావిస్తూ ఉంటారు. శివుడు.. ఆయన భార్య పార్వతీదేవి.. పిల్లలు గణేశుడు.. కుమారస్వామి తో కలిసి ఇక్కడే జీవిస్తూ ఉంటారని హిందువులు నమ్ముతుంటారు. బౌద్ధులు ఈ ప్రాంతాన్ని కాంగ్రిన్ పోచే అని పిలుస్తుంటారు.. తెలుగులో చెప్పాలంటే మంచులో విలువైన ఆభరణం అని అర్థం. దీనిని బౌద్ధులు పరమ ఆనందానికి చిహ్నం లాంటి చక్ర సంవర అను భావిస్తుంటారు జైనమతస్తులు దీనిని అష్టపద పర్వతం అని పిలుస్తుంటారు. జైనులలో మొదటి తీర్థంకరుడైన రుశభ దేవుడు ఇక్కడ మోక్షం పొందాడని నమ్ముతుంటారు. బోన్ మతానికి సంబంధించి.. ఆ మతాన్ని విశ్వసించేవారు ఈ పర్వతాన్ని ఆధ్యాత్మిక శక్తికి కేంద్రంగా భావిస్తూ ఉంటారు.

ఈ పర్వత ప్రాంతంలోనే ఆశయాలు అత్యంత ముఖ్యమైన నదులు సింధు.. సట్లెజ్.. బ్రహ్మపుత్ర.. కరణాలి ఇక్కడే పుట్టాయి. కైలాస పర్వతానికి అత్యంత సమీపంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సు మానససరోవరం.. ఉప్పునీటి సరస్సు రక్షస్తాల్ ఇక్కడే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా మౌంట్ ఎవరెస్ట్ కు పేరు ఉంది. ఈ శిఖరం ఎత్తు 8,848 మీటర్లు. ఇంత ఎత్తైన శిఖరాన్ని పర్వతారోహకులు అధిరోహించారు. కానీ దానికంటే తక్కువ ఎత్తున కైలాస పర్వతాన్ని ఇంతవరకు ఎవరు ఎక్కలేకపోయారు. అయితే ఈ శిఖరానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దృష్ట్యా చైనా ప్రభుత్వం ఈ పర్వతాన్ని అధిరోహించడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ పర్వతాన్ని ఎక్కడానికంటే ముందు పర్యాటకులు దాని చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేస్తారు. 53 కిలోమీటర్ల ఉండే ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి మూడు రోజులగా పడుతుంది. కొంత మంది పరిశోధకులు కైలాస పర్వతాన్ని భూమికి, స్వర్గానికి మధ్య ఉన్న కేంద్ర బిందువు అని చెబుతుంటారు. తాజాగా ఒక హెలికాప్టర్ నుంచి కైలాస శిఖర దృశ్యాలను వీడియోలలో చిత్రీకరించారు. అందులో కైలాస శిఖరం అత్యంత అద్భుతంగా ఉంది. శివుడు నివాసం ఉంటున్నట్టుగానే అక్కడి వాతావరణం కనిపిస్తుంది.

 

 

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper