Shiv Ghat Temple: శివుడి శిరస్సు మీద గంగ ఉంటుంది. శివుడికి అభిషేకం చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటుంది. గంగ ప్రేమ తనకు తెలుసు కాబట్టి శివుడు తన శిరస్సు మీద ఆమెకు స్థానం కల్పించాడు.
పురాణాల ప్రకారం గంగకు కోపం వస్తే భీకరంగా ప్రవహిస్తుంది. శాంతంగా ఉంటే ప్రేమను కనబరుస్తుంది. ఎంతటి భీకరమైనా.. ఎంతటి కోపమైనా సరే గంగ తన ప్రవాహాన్ని ఆపదు. తను ఆగదు. శివుడు కనిపిస్తే చాలు గంగ తన ప్రేమను వ్యక్తం చేస్తూనే ఉంటుంది. శివుడి లింగం మీద గంగ నీళ్లతో అభిషేకం చేస్తే చాలు.. ముక్కంటి తన్మయత్వం చెందుతాడు. తనను అభిషేకించిన భక్తులకు వరాలు ప్రకటిస్తాడు.
గంగ మిగతా చోట్ల ఏమోగానీ.. శివుడు కొలువై ఉన్న ప్రాంతాలలో తరంగం లాగా దూసుకు వస్తూ ఉంటుంది. విపరీతమైన వేగంతో శివుడిని అలముకుంటుంది. ఆ ప్రేమను.. ఆ సాంగత్యాన్ని.. వర్ణించలేం. చూడాలి అంతే.. మనదేశంలో శివుడిని తన జలంతో అభిషేకించే గంగమ్మ తాలూకు ఆలయాలు చాలా ఉన్నాయి. అయితే గుజరాత్ రాష్ట్రంలో డాంగ్ జిల్లాలో ఉన్న శివ ఘాట్ ఆలయం మాత్రం చాలా ప్రత్యేకం.
ఇక్కడ శివుడి మీద నుంచి కాలానుగుణంగా గంగమ్మ నేరుగా ప్రవహిస్తూ ఉంటుంది. చూసేందుకు ఇది ఒక అద్భుతమైన దృశ్యం లాగా కనిపిస్తూ ఉంటుంది. గంగమ్మ అంత ఎత్తున ఉన్న కొండల నుంచి దూసుకొస్తూ ఉంటుంది. జాలు వారే జలాలతో శివుడిని అభిషేకిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి వర్షాకాలంలో ఈ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా గంగమ్మ తాకిడికి ఏం నిర్మాణం కూడా నిలబడలేదు. కానీ అంత ఎత్తునుంచి గంగమ్మ దూకుతున్నప్పటికీ.. ఇక్కడ శివుడికి గాని.. ఆలయానికి గాని ఎటువంటి నష్టం జరగదు. భారత ప్రభుత్వం హెరిటేజ్ జాబితాలో చేర్చడం విశేషం. ఈ ఆలయాన్ని విస్తరించడానికి గుజరాత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనికి గానూ భారీగానే నిధులు విడుదల చేసింది.
ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శివ ఘాట్ ఏరియాలో ఉన్న గంగ పైనుంచి భీకరంగా దూసుకు వస్తోంది. శివుడిని తన జలాలతో అభిషేకిస్తుంది. ఈ దృశ్యం అద్భుతంగానూ.. ఆధ్యాత్మికంగాను గొప్పగా ఉంది. దీనిని కొంతమంది భక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అవి కాస్త అద్భుతంగా ఉన్నాయి.
View this post on Instagram