Sri Krishna Son Samba : మహావిష్ణువు ఎనిమిదవ అవతారం అయిన శ్రీకృష్ణుడి జీవితంలో ఎన్నో కీలకమైన ఘట్టాలు ఉన్నాయి. మహాభారతం మొదలుకొని.. భగవద్గీతను ప్రజలకు పంచిన శ్రీకృష్ణుడు అందమైన ద్వారకా నగరాన్ని నిర్మించి పాలించాడు. యాదవ వంశం అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిచాడు. అయితే ఇంతటి మహా పురుషుడికి తన సొంత కుమారుడి వలన ఎంతో వేదన మిగిలింది. ఆయన చివరి రోజులు విషాదంగా గడిచాయి. అసలు శ్రీకృష్ణుడి కుమారుడు ఎవరు? ఆయన వల్ల యాదవ వంశం ఎలా నాశనం అయ్యింది?
భాగవతంలో శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు అనే పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. శ్రీకృష్ణుడు, జాంబవతి సంతానం సాంబుడు గా చెబుతారు. చిన్నప్పటి నుంచే అల్లరి చేష్టలు ఎక్కువగా కలిగిన ఈ సాంబుడు యుద్ధ ప్రావీణ్యం లో ఆరితేరాడు. అయితే ఎక్కువగా పరిహాసాలు చేయడం వల్ల యాదవ వంశం నాశనానికి కారణమైంది. అసలు ఈ సాంబుడు గత జన్మలో ఉన్నాడా? త్రేతా యుగంలో ఎందుకు జన్మించాల్సి వచ్చింది? యాదవుల వంశం నాశనం అవుతుందని శ్రీకృష్ణుడికి తెలియదా?
ఏదైనా ఒక యుగం అంతానికి ఒక బలమైన కారణం కావాలి. ఇది అరాచకంతోనే మొదలవుతుంది. ఆ విధంగా సాక్షాత్తు మహాదేవుడి కుమారుడిగా జన్మించిన సాంబుడు చరిత్ర రామాయణంలో వినిపిస్తుంది. ఈ సమయంలో రాముడికి సహకరించిన వారిలో జాంబవంతుడు ఒకరు. రావణుడితో యుద్ధం ముగిసిన తర్వాత రాముడు జాంబవంతుడిని పిలిచి ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు జాంబవంతుడు చేయాలని ఉందని ‘మీతో మల్ల యుద్ధం చేయాలని ఉంది’అని విచిత్రమైన కోరికను కోరుతాడు. వచ్చేయుగంలో ఆ కోరిక తీరుతుందని రాముడు జాంబవంతుడికి వరం ఇస్తాడు. అయితే త్రేతా యుగంలో శమంతకమని పోతే.. ఆ నింద శ్రీకృష్ణుడిపై పడి.. అడవికి వెళ్లడం.. ఆ తర్వాత జాంబవంతుడితో యుద్ధం చేయడం వంటివి జరుగుతాయి. అయితే ఈ యుద్ధంలో జాంబవంతుడిని ఓడించి అతని కూతురు జాంబవతిని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకుంటాడు.
శ్రీకృష్ణుడికి ఉన్న ఎనిమిది మంది భార్యల్లో జాంభవతి ఒకరు. మిగతా వారందరికీ సంతానం కాగా జాంబవతికి మాత్రం ఆలస్యమైంది. అయితే పిల్లల కోసం ప్రతిరోజు శివారాధన చేసేవారు. ఈ నేపథ్యంలో కూడా పూజలు చేయించింది. భార్యాభర్తలు కలిసి పూజలు చేస్తే పిల్లలు కలుగుతారని ఓ మహర్షి చెబుతాడు. దీంతో శ్రీకృష్ణుడు, జాంబవతి కలిసి మహా శివుడికి పూజలు చేస్తారు. దీంతో శివుడి అనుగ్రహంతో జాంభవతికి సాంబుడు అనే కుమారుడు జన్మిస్తాడు.
అయితే సాంబుడు చిన్నప్పటి నుంచే అల్లరి చేష్టలు ఎక్కువగా అలవాటు చేసుకునేవాడు. తల్లి గారాబంతో.. తండ్రి రాజు అన్న అహంకారంతో ప్రతి ఒక్కరిపై దాడి చేసేవారు. అంతేకాకుండా ఆడవాళ్ళ విషయంలోనూ కూడా సాంబుడు వింతగా ప్రవర్తించేవాడు. ఓసారి ఇతడు చేసిన పనికి శ్రీకృష్ణుడు కుష్టు వ్యాధి గ్రస్తుడైతావని శాపం ఇస్తాడు. అయితే ఆ తర్వాత తన తప్పును తెలుసుకొని శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడితే.. సూర్యుడిని ఆరాధిస్తే ఈ వ్యాధి నయమవుతుందని చెబుతాడు. దీంతో సూర్యుడు కోసం తపస్సు చేసి వ్యాధిని నయం చేసుకుంటాడు.
అయితే ఒకరోజు సాంబుడు అతిగా మద్యం సేవించాడు. అప్పుడే శ్రీకృష్ణుడితో మాటామంతి పూర్తి చేసుకుని బయటకు వస్తున్న దూర్వాసుడు, ఇతర మునులకు ఎదురుపడ్డాడు. అయితే వాళ్లను ఆట పట్టించేందుకు గర్భిణీ వేషంలో వచ్చి.. నాకు ఎవరు పుడతారో చెప్పండి అంటూ పరిహాసం ఆడాడు. తాను ఆడే నాటకం గురించి తెలుసుకున్న దుర్వాసుడు కోపంతో మీ కడుపులో ముసలం పుడుతుంది అని.. ఇది యాదవ వంశం నాశనానికి కారణం అవుతుందని శపిస్తాడు. ముసలం అంటే ఇనుప రోకలి. దూర్వాసుడి శాపం కారణంగా సాంబుడు రోకలికి జన్మనిస్తాడు. అయితే రాజవంశంలోని చాలామంది భయపడి ఆ రోకలిని కరిగించి సముద్రంలో పడేస్తారు. అయితే ఆ పొడి మళ్ళీ తీరానికి కొట్టుకు వచ్చి గడ్డి గా మొలుస్తుంది.
అయితే ఈ గడ్డి గా మొలిచిన చోటే యాదవులంతా ఉంటారు. మీరు అప్పటికే తాగి ఒకరికొకరు. వాదించుకుంటారు. ఈ క్రమంలో అప్పటికే అక్కడ మొలిచిన వెదురు కర్రలతో ఒకరినొకరు కొట్టుకుంటారు. ఈ క్రమంలో సాంబుడు కూడా చనిపోతాడు. అయితే సముద్రంలో పారేసిన ఇనుప ముక్కల్లో ఒక ముక్క వేటగాడికి దొరుకుతుంది. అతడు ఆ ముక్కతో బాణంను తయారు చేసుకుంటాడు. ఆ తర్వాత ఒకరోజు శ్రీకృష్ణుడు వనంలో సేద తీరే క్రమంలో తన కాలు ఊగుతుండగా.. అది జంతువు అనుకొని వేటగాడు బాణం వదులుతాడు.. దాంతో శ్రీకృష్ణుడి అవతారం ముగుస్తుంది.