Horoscope Today: 2024 జూన్ 4 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. మంగళవారం సందర్భంగా కొన్ని రాశుల వారికి ఆంజనేయుడి అనుగ్రహం ఉండనుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగులు చాకచక్యంగా పనిచేయాలి. లేదంటే అవమానాలు పొందే అవకాశం.
వృషభ రాశి:
భూ తగాదాల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారులు లాభాలు పొందే అవకాశాన్ని కోల్పోతారు. కుటుంబ సమస్యలపై నిర్లక్ష్యాన్ని వీడాలి.
మిథున రాశి:
మీ మాటలతో ప్రజలను ఆకర్షిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. కోరికలను నేరవేర్చుకోవడంలో కృషి చేస్తారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.
కర్కాటక రాశి:
కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. చాలా విషయాల్లో తొందరపడకండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
సింహారాశి:
కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆందోళనగా ఉంటుంది. ఉద్యోగులకు సంపద పెరుగుతుంది. ముఖ్యమైన పనులు శ్రద్ధగా చేయాలి.
కన్య రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలపై జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్లాన్ వేసుకుంటూ ముందుకు వెళ్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నాంచాలి.
తుల రాశి:
కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
వృశ్చిక రాశి:
వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహారించాలి. కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహత్యం పెరుగుతుంది.
ధనస్సు రాశి:
ఉద్యోగులు కార్యాలయాల్లో అప్రమత్తంగా ఉండాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలనే ఆసక్తి పెరుగుతుంది.
మకర రాశి:
కొన్ని విషయాల్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారులు ఇతరుల సలహా తీసుకోవాలి. ఉద్యోగులు నియమాలకు అనుగుణంగా నడుచుకోవాలి.
కుంభరాశి:
వ్యాపారులు ఇతరుల సలహా తీసుకుంటారు. ఆద్యాత్మిక కార్యాక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. స్నేహితుల నుంచి ఫుల్ సపోర్టు ఉంటుంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.
మీనరాశి:
కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా వాదనలు చేయొద్దు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Horoscope today profits are profits for traders of these zodiac signs today
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com