Horoscope Today: 2024 జూన్ 18 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో త్రిగ్రాహి యోగం కారణంగా 5 రాశుల వారికి మహర్దశ కలగనుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మేషం నుంచి 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు కటుంబ సభ్యుుల మద్దతు ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. సాయత్రం ఉల్లాసంగా ఉంటారు.
వృషభ రాశి:
ఆర్థిక లావాదేవాల్లో జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులు తోటివారితో సంయమనం పాటించాలి.
మిథున రాశి:
వ్యాపారులకు నష్టాలు వచ్చే అవకాశం. ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆలోచించాలి. కుటుంబ సభ్యుల నుంచి ఆదాయం పొందుతారు.
కర్కాటక రాశి:
ఉద్యోగులు తీసుకునే కొన్ని నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడుతారు. భవిష్యత్ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
సింహారాశి:
స్నేహితులతో కొన్ని సమస్యలు వస్తాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో బాధ్యతలు పెరుగుతాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్త పరిచయాలపై జాగ్రత్తగా ఉండాలి.
కన్య రాశి:
కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడుతారు. ఆద్యాత్మిక కార్యక్రమాలపై శ్రద్ధ చూపుతారు. జీవిత భాగస్వామితో సమస్యలు ఎదుర్కొంటారు.
తుల రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థుల కెరీర్ పై నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు.
వృశ్చిక రాశి:
కుటుంబ సభ్యుల్లో అపార్థాలు ఏర్పడుతాయి. ఉద్యోగులకు స్థాన చలనం ఉండే అవకాశం.ఇంటికి అతిథుల రాక పెరుగుతుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు.
ధనస్సు రాశి:
వ్యాపారంలో పెట్టుబడులు లాభిస్తాయి. దూరపు ప్రయాణాలు ఉండే అవకాశం. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటుంది. ఆర్థిక వృద్ధి ఉంటుంది.
మకర రాశి:
మనసు ప్రశాంతంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు. ఆర్థికంగా బలపడుతారు. ఖర్చులను నియంత్రించాలి. జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేస్తారు.
కుంభరాశి:
కొన్ని పనుల కారణంగా బిజీ వాతావరణంలో ఉంటారు. కొన్ని పనుల నిమిత్తం ఆదాయం పెరుగుతుంది. పొదుపు పథకాల్లో డబ్బులు సేవ్ చేస్తారు.
మీనరాశి:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. రాజకీయ నాయకుల వారికి ఇతరుల మద్దతు ఉంటుంది.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More