Nadendla Manohar ఆంధ్రాలో నిన్న వచ్చిన వార్త రేషన్ బియ్యం తిరిగి దుకాణాల్లోనే తీసుకోవాలని ప్రజలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇంటింటికి వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేసిన విధానాన్ని రద్దు చేశారు. రేషన్ షాపుల్లోనే తీసుకోవడం వల్ల దుర్వినియోగం తగ్గి జవాబుదారితీనం పెరుగుతుంది.
15 రోజులు వ్యాన్లు తిరిగి ఇంటింటికి పంపిణీ చేస్తే.. మరో 15 రోజులు ఖాళీగా వాహనాలు తిరుగుతున్నాయి. అదే రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తే ఈ వ్యయం తగ్గుతుంది. పారదర్శకత పెరుగుతుంది. అందుకే ఈ కోణంలోనే ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రేషన్ కార్డులు అవసరమైన వారికే ఇవ్వాలి. అనవసరమైన వాళ్లకు, మిస్ యూజ్ చేసే వాళ్లకు ఇవ్వొద్దు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కానీ.. రైతు భరోసాకానీ లబ్ధి పొందే హక్కు ఉంది. పేదలకు ఈ పథకాలు అందాలి. అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. పేదలు కానీ వారికి అసలు ఇవ్వొద్దు. రైతులకు ఇది అవసరం లేదు. దీని వల్ల ప్రభుత్వ డబ్బు సేవ్ అవుతుంది. విద్య, ఆరోగ్యం మీద ఖర్చు పెట్టండి.
శభాష్ నాదెండ్ల రేషన్ బియ్యం ఇకనుంచీ దుకాణం నుంచే పంపిణీపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.