Andhra Pradesh : నెలకో కేసు పడుతుంది ఆ ఎడిటర్ మీద.. కేసు ఊరికనే పడదు కదా.. ప్రజాస్వామ్యంలో మనుషులకు ఉన్నట్టుగానే.. మీడియాకు కూడా స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ వల్ల మనదేశంలో మీడియా ఇండిపెండెంట్ వ్యవస్థ లాగా పని చేస్తోంది.
దురదృష్టవశాత్తు మీడియాలోకి స్వార్ధ శక్తులు.. వ్యాపారవేత్తలు.. రాజకీయ నాయకులు మారిపోవడంతో అది దాని రూపాన్ని మార్చుకుంది. రాజకీయ నాయకులు ఊసరవెల్లుల మాదిరిగా ఎలా అయితే రంగులు మార్చుతారో.. మీడియా కూడా అలానే రంగులు మార్చడం మొదలుపెట్టింది.
పేపర్ పేరు చెప్తే చాలు ఏ పార్టీకి అనుకూలం.. న్యూస్ ఛానల్ పేరు చెబితే చాలు ఏ రాజకీయ నాయకుడికి అనుకూలం.. అని చెప్పే స్థాయికి ప్రజలు ఎదిగితే.. మీడియా అంతకు దిగజారిపోయింది. వాస్తవానికి మీడియా తన విశ్వసనీయతను ఎన్నడు కోల్పోలేదు. ఎందుకంటే మీడియా అనేది ఒక బలమైన మాధ్యమం మాత్రమే. అది ఉన్నది ఉన్నట్టు.. లేనిది లేనట్టు చూపిస్తే ప్రజలు నమ్ముతారు. కానీ మీడియాకు ఉన్న విశ్వసనీయతను అమ్మకపు సరుకులాగా వ్యాపారవేత్తలు.. రాజకీయ నాయకులు మార్చడంతో పరిస్థితి దారుణంగా దిగజారింది.
ఓ పత్రికలో ఏపీలో ప్రభుత్వానికి సంబంధించి దారుణమైన కథనాలు ప్రసారమవుతున్నాయి. పత్రికలో ప్రచురితమవుతున్నాయి ఆ పత్రిక ఎవరిది.. ఆ ఛానల్ ఎవరిది అని చెప్పాల్సిన పనిలేదు. కాకపోతే ఆధారాలు లేకుండా కేవలం బురద చిమ్మడం మాత్రమే లక్ష్యంగా ఆ మీడియా వ్యవస్థలు పనిచేస్తున్నాయి. దీనికి తోడు వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా ఆ కథనాలు ఉండడంతో ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ఆ పత్రికలో సరిగ్గా గత నెల 30న బెజవాడ భారీ డీల్ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఆ కథనంలో ఓ పోలీస్ బాస్ ఓ కంపెనీ పేరుతో మోసం చేశారని.. డిపాజిట్లు సేకరించారని.. ఇందులో నిందితులతో అక్రమంగా ఒప్పందం కుదుర్చుకున్నారని.. తన అధికారిక హోదాను అక్రమ సంపాదన కోసం వాడుకున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఈ కథనం ఏపీ పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగాఉంది. సరిగ్గా ఇదే విషయాన్ని ఏపీ పోలీసుల సంఘం బాధ్యులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో.. ఈ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అంతేకాదు ఈ వార్త రాసిన వ్యక్తులను.. ప్రచురించిన సంస్థ మీద కేసు పెట్టాలని భావించింది. ఈ క్రమంలోనే ఒక జీవో విడుదల చేసింది.. ఈ జీవో ప్రకారం ఆ పత్రిక ఎడిటర్ మీద.. ఇతర వ్యక్తుల మీద కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఆ పత్రిక ఎడిటర్ మీద నెలకొక కేసు నమోదు అవుతుంది. ఆ పత్రిక ఎడిటర్ కూడా ఈ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత పత్రిక ఎడిటర్ కీలక స్థానంలో ఉన్నారు. వైసిపి అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఆ పార్టీ అనుబంధ పత్రికలోకి వచ్చారు. ఇప్పుడు ఎడిటర్ గా పని చేస్తున్నారు. నెలకు ఒక కేసును ఎదుర్కొంటున్నారు. మరి ఈ కేసులను ఎలా పరిష్కరించుకుంటారు.. న్యాయస్థానంలో ఎలా పోరాడుతారో చూడాల్సి ఉంది.