Homeఆంధ్రప్రదేశ్‌AP Development : విభజన విషాదాన్ని మరచిపోయే విధంగా సుందర భవిష్యత్తు దిశగా ఆంధ్ర ప్రదేశ్

AP Development : విభజన విషాదాన్ని మరచిపోయే విధంగా సుందర భవిష్యత్తు దిశగా ఆంధ్ర ప్రదేశ్

AP Development : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, విభజన ఇచ్చిన గాయాలు, మిగిల్చిన సవాళ్లు నాటికీ ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ వంటి మహానగరాన్ని, ఆదాయ వనరులను కోల్పోయి ఆర్థిక లోటుతో ప్రయాణం ప్రారంభించిన ఏపీకి తక్షణమే కావాల్సింది బలమైన మౌలిక వసతులు, పారిశ్రామిక వేగం మరియు గ్లోబల్ కనెక్టివిటీ. విభజన విషాదాన్ని, గతాన్ని తలచుకుని దిగులుపడటం కంటే.. భవిష్యత్తు వైపు అడుగులు వేయడమే ఏకైక పరిష్కారం. ఆ దిశగా నేడు […]

AP Development : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, విభజన ఇచ్చిన గాయాలు, మిగిల్చిన సవాళ్లు నాటికీ ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ వంటి మహానగరాన్ని, ఆదాయ వనరులను కోల్పోయి ఆర్థిక లోటుతో ప్రయాణం ప్రారంభించిన ఏపీకి తక్షణమే కావాల్సింది బలమైన మౌలిక వసతులు, పారిశ్రామిక వేగం మరియు గ్లోబల్ కనెక్టివిటీ. విభజన విషాదాన్ని, గతాన్ని తలచుకుని దిగులుపడటం కంటే.. భవిష్యత్తు వైపు అడుగులు వేయడమే ఏకైక పరిష్కారం. ఆ దిశగా నేడు ఆంధ్రప్రదేశ్ ప్రగతి రేసులో దూసుకుపోతోందనడానికి స్పష్టమైన నిదర్శనం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం!

ఉత్తరాంధ్రకు ‘సిరి’ తలుపులు

ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చేసే అతిపెద్ద ఇంజిన్ ‘భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’. దశాబ్దాలుగా వెనుకబాటుతనంతో సతమతమవుతున్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఈ విమానాశ్రయం గేమ్‌చేంజర్‌గా మారనుంది. కేవలం విమానాల రాకపోకలకు మాత్రమే పరిమితం కాకుండా, రీజనల్ ఎకనామిక్ హబ్‌గా తీర్చిదిద్దుతుండటం శుభపరిణామం.

పారిశ్రామిక, ఐటీ వృద్ధి

అంతర్జాతీయ స్థాయి రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తే, బహుళజాతి సంస్థలు (MNCs) విశాఖ తీరానికి క్యూ కట్టడం ఖాయం. దీనివల్ల ఉత్తరాంధ్ర యువతకు స్థానికంగానే లక్షలాది ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

టూరిజం & ఫార్మా రంగాలు

విశాఖ ఫార్మా క్లస్టర్‌కు, అరకు-లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాలకు విదేశీ కనెక్టివిటీ లభించడం వల్ల ఆర్థిక వ్యవస్థ సరికొత్త పుంతలు తొక్కుతుంది.

మౌలిక వసతులే ప్రగతికి పునాది

ఒక రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే భారీ మౌలిక వసతుల కల్పన అత్యంత అవసరం. విభజనతో దెబ్బతిన్న ఏపీకి భోగాపురం ప్రాజెక్టు ఒక బలమైన నమ్మకాన్ని ఇస్తోంది. గడువులోగా పనులు పూర్తి చేసుకుంటూ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుండటం రాష్ట్ర పాలనా యంత్రాంగం, పారిశ్రామిక భాగస్వాముల పట్టుదలకు నిదర్శనం. విశాఖను ఎగ్జిక్యూటివ్ లేదా ఐటీ క్యాపిటల్‌గా, పారిశ్రామిక రాజధానిగా నిలబెట్టాలనే లక్ష్యానికి ఈ ఎయిర్‌పోర్ట్ ఊపిరి పోస్తోంది.

కన్నీళ్ల నుంచి కాంతుల వైపు!
గతం నేర్పిన పాఠాలతో, విభజన బాధను దిగమింగుకుని.. ఆధునిక, సమర్థవంతమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకోవాల్సిన సమయం ఇది. భోగాపురం విమానాశ్రయం సాధిస్తున్న ఈ వేగం కేవలం రన్-వే పై పరుగులు తీస్తున్న విమానాలది మాత్రమే కాదు; అది సమగ్ర ఆంధ్రప్రదేశ్ ఆత్మవిశ్వాసానికి, భవిష్యత్ ప్రగతికి లభించిన ‘టేకాఫ్’! మౌలిక వసతుల కల్పన, పరిశ్రమల రాక ఇలాగే కొనసాగితే.. విభజన విషాదాలు పటాపంచలై, ఏపీ భవిష్యత్తు సుందరంగా, సుస్థిరంగా మారడం ఖాయం.

విభజన విషాదాన్ని మరచిపోయే విధంగా సుందర భవిష్యత్తు దిశగా ఆంధ్ర ప్రదేశ్ .. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper