Homeఆంధ్రప్రదేశ్‌Janasena Rayalaseema : పాలెగాళ్ల రాజ్యంలో జనసేన ప్రభావం ఎంత? ఎన్ని సీట్లలో గెలుపు అవకాశాలు

Janasena Rayalaseema : పాలెగాళ్ల రాజ్యంలో జనసేన ప్రభావం ఎంత? ఎన్ని సీట్లలో గెలుపు అవకాశాలు

Janasena Rayalaseema : ఏపీలో జనసేన దూకుడు పెంచింది. అధికార పక్షం పై కయ్యానికి కాలు దువ్వుతోంది. అదును చూసుకుని జగన్ ప్రభుత్వం పై విమర్శల దాడి చేస్తోంది. వైజాగ్ పర్యటన మొదలుకొని ఇప్పటం పర్యటన వరకు అధికార పక్షాన్ని టార్గెట్ చేసింది. రాజధాని సమస్య మొదలుకొని రోడ్ల సమస్య వరకు జగన్ పాలన పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది. జనసేనాని దూకుడు ప్రధాన స్రవంతి మీడియా దృష్టిని ఆకర్షించింది. అప్పటి వరకు సీన్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ కాస్త తెర మరుగైంది. వైసీపీ, జనసేన రెండూ నువ్వా నేనా అన్నట్టు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ, జనసేనలు పోటీపడుతున్నాయి. రాజకీయ అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో జనసేన ప్రభావం ఎంత ?. ముఖ్యంగా రాయలసీమలో జనసేన రాణించగలదా ? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

2014 ఎన్నికల్లో జనసేన పోటీలో నిలబడకపోయినప్పటికీ.. టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చింది. అనంతరం నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ.. సమస్యల ఆధారంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చింది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. కేవలం రాజోలు నియోజకవర్గంలో మాత్రమే గెలిచింది. జనసేనాని పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు. ఓటమికి కుంగిపోకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. జనసేన బలం ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాల్ని రూపొందిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే విధంగా పార్టీ కార్యకర్తల్ని ప్రోత్సహిస్తున్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో మీడియా అటెన్షన్ తమపై ఉండేలా చూసుకుంటున్నారు.

కోస్తా ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో జనసేన ప్రభావం బలంగా ఉంటుంది. కాపులు అధికంగా ఉన్న చోట జనసేనకు గ్రామస్థాయి కేడర్ ఉంది. 2019 ఎన్నికల్లో ఒక స్థానంలోనే గెలిచినప్పటికీ, చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఓటమికి జనసేన పరోక్షంగా కారణమైంది. అది కూడా కోస్తా ప్రాంతంలోనే టీడీపీ గెలుపును దెబ్బతీసింది. 2019 ఎన్నికల్లో జరిగిన తప్పు పునరావృతం కాకూడదని జనసేన భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలనివ్వను అంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటన చేశారు. కోస్తా ప్రాంతం వరకు జనసేన ప్రభావం కొద్దిగా ఉన్నప్పటికీ.. రాయలసీమలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. పవన్ అభిమానులు, కాపు ఓటర్లు ఉన్నప్పటికీ చాలా నియోజకవర్గాల్లో జనసేన ఇన్ చార్జ్ లు లేరు. కనీసం పార్టీ పిలుపునకు స్పందించి కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్నా అది కూడా నామమాత్రమే. ఏపీలోని మిగిలిన ప్రాంతాల్లో జనసేన పరిస్థితి ఒకలా ఉంటే, రాయలసీమలో మరొకలా ఉంది.

రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే 2019 ఎన్నికల్లో వైసీపీ 49 గెలిచింది. టీడీపీ మూడు స్థానాలు గెలిచింది. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మాత్రమే గెలిచారు. సైకిల్ చక్రానికి ఫ్యాన్ గాలి తీసిందనే చెప్పుకోవాలి. ఒకప్పుడు అనంతపురంలో టీడీపీ బలంగా ఉండేది అలాంటి ప్రాంతంలో కూడ వైసీపీకి 14 స్థానాలకు గాను 12 స్థానాలు గెలుచుకుంది. ఇక జనసేన నియోజకవర్గానికి నాలుగైదు వేల ఓట్లతో సరిపెట్టుకుంది. కొన్ని నియోజకవర్గాల్లో అవి కూడ రాలేదు. ఎన్నికల అనంతరం రాయలసీమలో జనసేన పెద్దగా కార్యక్రమాలు కూడా నిర్వహించింది లేదు. రాయలసీమలో కరువు యాత్ర చేస్తానన్న పవన్ కల్యాణ్ ఆ దిశగా అడుగులు వేసి జనసేనను సీమలో బలోపేతం చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. పవన్ ‘వారాహి’ బస్సు యాత్రను రాయలసీమలోని తిరుపతి నుంచే మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక పవన్ ఈసారి తిరుపతి నుంచే బరిలోకి దిగుతుండడం కూడా జనసేనకు ఊపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. పవన్ ఇక్కడి నుంచి పోటీచేస్తే పార్టీ కార్యకర్తలకు కొండంత బలం ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే చిరంజీవి తిరుపతిలో గెలిచారు. ఇక్కడి వారు ఆదరించారు. ఇప్పుడు పవన్ కూడా అదే పనిచేయబోతున్నారు. పార్టీ కార్యక్రమాలను సీమలో విస్తృత పరిచేందుకు పవన్ యోచిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజాపోరాటాలను సీమ నుంచే నిర్వహించడానికి ఈ మధ్య పర్యటనలు పెంచారు.

2024 ఎన్నికలకు జనసేన కార్యక్షేత్రంగా కోస్తా ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు ఆ పార్టీ వైఖరిని చూస్తూ అర్థమవుతోంది. రాయలసీమలో కూడా ఇక నుంచి జనసేనకు ఊపు తెచ్చే కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. రాయలసీమలో పార్టీ ఉనికిని చాటే ప్రయత్నం కూడా మొదలుపెట్టారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు జనసేనను ఇక్కడ బలోపేతం చేయడానికి శ్రమిస్తున్నారు. మిగిలిన పార్టీల నంచి చేరికలుగానీ, ప్రజాపోరాటాలకు సిద్ధమవుతున్నారు. బలం లేని రాయలసీమలో బలోపేతం కావడానికి జనసేనాని అడుగులు పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో యువతకు రాయలసీమలో పెద్దసంఖ్యలో సీట్లు ఇవ్వాలని.. కనీసం 20 సీట్లు అయినా గెలవాలని పవన్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. బలమైన అభ్యర్థులను దింపితే ఆ సీట్లలో గెలుపు అవకాశాలు ఉంటాయని జనసైనికులు నమ్ముతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper