Rayalaseema Development : రాయలసీమ.. ఎప్పటి నుంచో వింటున్నా.. అత్యంత కరువు ప్రాంతంగా పేరు పొందింది. దీనికి పరిష్కారంగా.. పారిశ్రామికీకరణ చేయాలని ప్రభుత్వాలు పూనుకున్నాయి. చంద్రబాబు పాలనలో కియా ఫ్యాక్టరీ రావడంతో గేమ్ చేంజర్ అనుకుంన్నాం. కానీ ఇది గేమ్ చేంజర్ కాదు. ఇంకా ఎన్నో పరిశ్రమలు.. పారిశ్రామిక కారిడార్ లు వస్తున్నాయి. ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి.. కానీ ఎందుకీ గేమ్ చేంజర్ తెలుసుకోవాలి. రాయలసీమ కరువు ప్రాంతం అయితే.. కోస్తాంధ్ర అభివృద్ధి చెందిన ప్రాంతం. వ్యవసాయం.. నీటి పరుదలతో సస్యశ్యామలం కాబోతోంది.
వెలిగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు త్వరలో శంకుస్థాపన చేస్తున్నారు. ఈ కనిగిరి ప్రాంతం కరువు ప్రాంతం. ఫ్లోరైడ్ తో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మార్కపురం జిల్లా ఎంతో వెనుకబడి జిల్లా. ఆ ప్రాంతానికి ఇప్పుడు నీటి కరువు తీరబోతోంది. కానీ ఇది రాయలసీమ మొత్తానికి ఇది గేమ్ చేంజర్ కాదు..

ఆంధ్ర గేమ్ చేంజర్ పోలవరం ప్రాజెక్ట్ కానుంది. రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా మారింది. దేశంలోనే నంబర్ 1 ఫ్రూట్ ప్రొజెక్షన్ లో ఏపీ నంబర్ 1. అందులో ప్రధాన భాగం రాయలసీమనే. మరి దాన్నే మాగ్జిమైజ్ చేస్తే.. రాయలసీమ ప్రజల కరువు తీరి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. అటువంటి ప్రాజెక్ట్ 79 ఏళ్ల తర్వాత త్వరలో రాయలసీమలో సాకారం కాబోతోంది. రాయలసీమ దిశ దశ మారబోతోంది ఈ ప్రాజెక్టుతో.. కేంద్ర సహకారంతో లక్ష కోట్ల పెట్టుబడులను పెట్టబోతున్నారు. 5వేలకు పైగా గ్రామాలకు ఉపయోగపడబోతోంది. కొత్తగా ఏర్పడిన 10 జిల్లాలు.. రాయలసీమ ప్రకాశం, మార్కపురం జిల్లాలకు ఉపయోగపడనుంది. ఫేస్ 1లో ఆయకట్టు స్తిరీకరణ 22 లక్షల ఎకరాలకు. విస్తరణ 4 లక్షల ఎకరాలతో మొత్తం 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నారు. ఫేస్ 2లో 37 లక్షల ఎకరాలు సాగులోకి రాబోతున్నాయి. దేశంలో ఎక్కడ కూడా హార్టికల్చర్ అతిపెద్ద ప్రాజెక్ట్ జరగలేదు.
రాయలసీమకు నిజమైన గేమ్ ఛేంజర్ ఏది? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.