How to get rich: ప్రతి ఒక్కరు తమ ఇంట్లో లక్ష్మీదేవి కలువుండాలని భావిస్తారు. అందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. లక్ష్మీ కటాక్షం పొందాలని కలలు కంటారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయపడుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి తమ ఇంటిలో కొలువుండాలని కోరుకుంటారు. దేవిని తమ ఇంట్లోకి ఆహ్వానిస్తూ పూజలు చేస్తారు. తమ ఇంటిని కనక వర్షంతో నింపాలని ఆకాంక్షిస్తుంటారు. మనం పాటించే కొన్ని చిట్కాలతో లక్ష్మీదేవి సంతోష పడితే మనకు లోటుండదు.

వాస్తు ప్రకారం ఇంటి ఎదుట తులసి మొక్క పెంచుకోవాలి. దానికి ఉదయం సాయంత్రం రెండు పూటలా నెయ్యితో దీపం పెట్టాలి. తులసి మొక్కలో సాక్షాత్తు శ్రీమహా విష్ణువు, లక్ష్మీదేవి కొలువుంటారని నమ్ముతారు. దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి కరుణించి మన ఇంటిలో కలువుంటుందని భక్తుల విశ్వాసం. కుటుంబంలోని కోరికలు తీర్చడంలో లక్ష్మీదేవి ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెబుతారు. అందుకే తులసి మొక్కను దైవప్రదంగా కొలుస్తారు. వాస్తు శాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తూర్పు దిశగా కూర్చుని భోజనం చేయాలి. ఈ దిక్కులో సూర్య భగవానుడు ఉదయించడంతో మనం తీసుకునే ఆహారం సూర్యుడికి అంకితం ఇచ్చి భోజనం చేయడం మంచిది. భోజనం చేసే ముందు కాళ్లకు చెప్పులు ఉంచుకోకూడదు. అన్నపూర్ణకు నమస్కారం చేసి ఆహారం తినాలి. ఇలా చేయడం వల్ల దేవతలు కూడా మనకు ఎంతో మేలు చేస్తారని నమ్ముతారు. ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందని చెబుతారు. ఇలా వాస్తు రీత్యా కొన్ని పద్ధతులు పాటిస్తే ఎంతో మంచి జరుగుతుంది.

ఇంటికి ఈశాన్య దిశ ప్రముఖమైనది. ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా చేయడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం దుష్టశక్తుల నుంచి ఇంటిని దూరంగా ఉంచడంలో ఈశాన్యమే ప్రధానమైనది. ఈశాన్యంలో గంగాజలం చల్లుకుంటే ఉత్తమం. ఇంకా నిద్ర లేవగానే అరచేతులు చూసుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతుంటారు. వాస్తు శాస్త్ర రీత్యా మనకు ఎన్నో మార్గాలుండటంతో వాటిని అనుసరించి మనం ధనవంతులం కావడానికి అనుకూలమైన చిట్కాలు పాటించాలి.
Also read: Disha Website: ఆఫర్లతో జర్నలిస్టుల వలసలు.. సక్సెస్ ‘దిశ’ తప్పుతోంది..
మనదేశంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇల్లు కట్టుకోవాలన్నా, డబ్బు సంపాదించాలన్నా వాస్తు పద్ధతులు సరిగా పాటించాల్సిందే. లేకపోతే మనకు ప్రతిబంధకాలు ఎదురవుతాయి. మన ఇంటిలోని అన్ని దిక్కులు సవ్యంగా ఉంటేనే మనకు ప్రయోజనాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం మన ఇంటిలో అన్ని దిక్కులు సవ్యంగా ఉండేలా ఉంచుకోవడంతో మనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. వాస్తు శాస్త్రం చక్కగా ఉంటే మనకు ఎలాంటి నష్టాలు దరిచేరవు.