Homeఎంటర్టైన్మెంట్Parusharam : ఇంతటి అత్యాశ అవసరమా డైరెక్టర్ మహాశయా!

Parusharam : ఇంతటి అత్యాశ అవసరమా డైరెక్టర్ మహాశయా!

Parshuram vs Allu Aravind Controversy : విషయం ఏదైనా కరెక్ట్ గా ఉండేవాళ్లకు సొసైటీలో విలువ ఉంటుంది. మాట మీద నిలబడే వాళ్లపై గౌరవం ఏర్పడుతుంది. అలా కాకుండా నమ్మిన వాళ్ళను గజిబిజికి గురి చేస్తే ఏదో రోజు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మొహమాటానికి పోకుండా ఉన్న మాట చెప్పి, లౌక్యంగా వ్యవహరిస్తే ఏ సమస్యా ఉండదు. ఎడా పెడా అడ్వాన్సులు తీసుకొని దర్శకుడు పరశురాం అభాసుపాలవుతున్నారన్న వాదన తెరపైకి వచ్చింది. అల్లు అరవింద్ దగ్గర అడ్వాన్స్ తీసుకుని కమిటైన పరుశరామ్, దిల్ రాజు బ్యానర్ లో మూవీ ప్రకటించడం కొత్త వివాదానికి దారి తీసింది. 

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురామ్ గీత గోవిందం మూవీ చేశాడు. అది డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అల్లు అరవింద్ కి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. పరుశురాం కెరీర్లో గీత గోవిందం అతిపెద్ద హిట్. ఆయనకు బ్రేక్ ఇచ్చిన మూవీ. హిట్ ఇచ్చిన దర్శకుడని పరుశురాంకు అడ్వాన్స్ ఇచ్చి అల్లు అరవింద్ మరో మూవీ లాక్ చేశాడు. స్క్రిప్ట్ సిద్ధం చేసి హీరోని ఒప్పించి ప్రాజెక్ట్ పట్టాలెక్కించాల్సిన బాధ్యత పరశురాందే అన్నాడు. పరశురాంతో నెక్స్ట్ మూవీ నాదే అని ఎదురుచూస్తున్న అల్లు అరవింద్ కి పరశురామ్ షాక్ ఇచ్చాడు. దిల్ రాజు బ్యానర్లో మూవీ ప్రకటించడంతో ఆయన ఖంగుతిన్నాడు. 
 
అయితే ఈ ప్రాజెక్ట్ లో అడ్వాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్ ని భాగస్వామిని చేసి కూల్ చేయాలని, వివాదం కాకుండా చూడాలని పరశురామ్ ప్రయత్నాలు చేశారు. అవేమీ ఫలించలేదని సమాచారం. పరశురాంని తీవ్రంగా దూషించి ఇకపై నా నుండి నీకు ఎలాంటి సప్పోర్ట్ ఉండదు. గీతా ఆర్ట్స్ లో మూవీ చేయలేవని హెచ్చరించి పంపాడని టాక్. కాగా గతంలో కూడా పరశురామ్ ఇలానే చేశారట. 14 రీల్స్ బ్యానర్ లో మూవీ చేస్తానని అడ్వాన్ తీసుకొని మైత్రీ మూవీ మేకర్స్ తో సర్కారు వారి పాట ప్రకటించారు. 
 
14 రీల్స్ అధినేత అసహనం వ్యక్తం చేయగా… సర్కారు వారి పాట నిర్మాణ భాగస్వామిగా ఉండేలా చేశారట. అదే ఫార్ములా విజయ్ దేవరకొండ మూవీకి కూడా అప్లై చేద్దామని చూసి అల్లు అరవింద్ వద్ద భంగపడ్డారు. అల్లు అరవింద్ తో పాటు మరో నిర్మాత వద్ద కూడా పరశురామ్ అడ్వాన్స్ తీసుకున్నాడని సమాచారం. ఈ క్రమంలో సినిమా లాక్ అయ్యాకే అడ్వాన్స్ లు తీసుకుంటే మంచిది కదా అన్న అభిప్రాయం వినిపిస్తుంది. ఒకవేళ నిర్మాతలు మొహమాట పెట్టి అడ్వాన్స్ చేతిలో పెడితే సున్నితంగా తిరస్కరిస్తే సరిపోతుంది. అత్యాశకు పోయి ముగ్గురు నలుగురు నిర్మాతల వద్ద అడ్వాన్సులు తీసుకొని సినిమాలు చేయకపోతే అందరికీ శత్రువై పరిశ్రమకు దూరం కావాల్సి వస్తుంది.  
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper