
Pawan Kalyan Vaaraahi : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏమి చేసినా ఈమధ్య సంచలనం అయిపోతుంది..2019 ఎన్నికలలో ఆయనకి ఎదురైనా పరాభవం వేరే ఎవరికైనా ఎదురై ఉంటె ఈపాటికి రాజకీయాల నుండి తప్పుకొని సినిమాలు చేసుకునే వారు, కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజా సమస్యలపై ప్రభుత్వం తో పోరాడుతున్నాడు.
అందుకే ఆయనకీ ఇప్పుడు అంత ప్రజాధారణ లభిస్తుంది, ఎంతలా అంటే ఆయన త్వరలో చేపట్టబోయ్యే ‘బస్సు యాత్ర’ కోసం సిద్ధం చేయించిన ‘వారాహి’ వాహనం కూడా సెన్సేషన్ అయిపోయింది..ఈ వాహనం వల్ల జనసేన పార్టీ కి ఒక రేంజ్ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి, కేవలం పూజ చేయించడానికి బయటకి తీసుకొస్తేనే ఈ వాహనం ని చూడడానికి జనాలు ఎగబడ్డారు..ఇక దాంట్లో తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
అయితే అభిమానుల్లో ‘వారాహి’ గురించి, దాని ప్రత్యేకతలు గురించి తెలుసుకునేందుకు అమితాసక్తి ని చూపిస్తూనే ఉన్నారు..అయితే ఈ వాహనం లో ఉన్న సోఫా సెట్ వెయ్యడానికి అయినా ఖర్చు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.ఫుల్ లెథర్ తో చేయించిన ఈ సోఫా విలువ 45 నుండి 50 వేల రూపాయిల వరకు ఉంటుందట.
పవన్ కళ్యాణ్ గారు అడిగారు కాబట్టి ఈ సోఫా ని ఉచితంగా చేయించి ఇవ్వాలనుకున్నానని, కానీ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదని,ఎప్పుడైతే ఈ డీల్ నాకు వచ్చిందో ఆరోజే ఫుల్ పేమెంట్ ఇచ్చేశారని, తయారు చెయ్యడానికి అయినా ఖర్చు కంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇచ్చారంటూ ఆ సోఫా ని డిజైన్ చేసిన అతను ఇటీవల ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.