Allu Aravind: గీత ఆర్ట్స్ అధినేతగా అల్లు అరవింద్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆయన బ్యానర్ లో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఇంకా కొన్ని సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇటీవల కాలంలో అల్లు అరవింద్ భిన్నమైన వ్యాపారాల వైపు దృష్టిసారించారు. అల్లు స్టూడియోస్ నిర్మించారు. హైదరాబాద్ నగరంలో అల్లు థియేటర్ కూడా నిర్మించారు. ఆయన చేతిలో గీత ఆర్ట్స్.. ఇంకా ఆహా ఓటీటీ కూడా ఉంది.
విలక్షణమైన నిర్మాతగా.. మార్కెట్ పరిస్థితులను ముందుగా అంచనా వేసే వ్యక్తిగా.. సినిమా నిర్మాణంలో ఖర్చును నియంత్రించుకుంటూ సాగే అద్భుతమైన ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ కు పేరు ఉంది. సినిమా ఇండస్ట్రీలోకి అల్లుడు రామలింగయ్య కుమారుడిగా వచ్చిన అరవింద్.. ఆ తర్వాత తన పేరుని ఒక బ్రాండ్ గా మార్చుకున్నారు. దీనిని బట్టి ఆయన ముందుచూపు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఏ వ్యాపారమైన సరే నష్టాలు ఉంటాయి.. లాభాలు కూడా ఉంటాయి. అల్లు అరవింద్ నిర్వహించే వ్యాపారాలలో నష్టాలు ఉండవు. ఇది ఇండస్ట్రీలో చెప్పే మాట. అయితే ఆయన సారథ్యంలో నడుస్తున్న ఆహా ఓటీటీ నష్టం లో ఉందా.. దానిని అమ్మేస్తున్నారా.. అసలు ఎందుకు ఈ నెగటివ్ స్పెక్యులేషన్.. ఏం జరుగుతుంది.
2024 లో ఆహాలోకి వ్యూహాత్మక భాగస్వామిని అల్లు అరవింద్ ఆహ్వానించారు. సరిగా 2020 ఫిబ్రవరి 8న ఆహా మొదలైంది. అధికారిక స్ట్రీమింగ్ 2020 మార్చి 25 నుంచి మొదలైంది. ఆహాలు ప్రధాన ప్రమోటర్లుగా గీత ఆర్ట్స్ నుంచి అల్లు అరవింద్.. మై హోమ్ గ్రూపు నుంచి జూపల్లి రామేశ్వరరావు ఉన్నారు. 2021 సంవత్సరం నుంచి తమిళ మార్కెట్లోకి ఆహా విస్తరించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో దిల్ రాజు.. విజయ్ దేవరకొండ ఈ ప్లాట్ఫారం లోకి వచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇందులో వారి వాటా ఎంత అనేది సక్రమంగా తెలియదు. 2024 లో సోనీ.. సన్ టీవీ వంటి సంస్థలు ఆహాలు స్ట్రాటజిక్ తీసుకోవడానికి ఆసక్తి చూపినట్టు వార్తలు వచ్చాయి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ పత్రిక నివేదిక ప్రకారం సోనీ కనీసం 26% వాటా తీసుకోవడానికి ఆసక్తి చూపించి.. దీని విలువ 1500 కోట్ల వరకు ఉంటుందని అప్పట్లో పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. ఈ చర్చల వార్తలను సోనీ అధికారికంగా ఖండించింది.. ఆహాతో ఎటువంటి ఒప్పందలు లేవని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు ఆహా విస్తరణకు అల్లు అరవింద్ విపరీతంగా కృషి చేస్తున్న నేపథ్యంలో దానిని అమ్మడం అనేది అబద్ధమని.. రీజినల్ ఓటిటిగా మార్చడానికి అల్లు అరవింద్ ప్రయత్నం చేస్తున్నారు.
కన్నడ.. మలయాళం మార్కెట్లోకి ఆహా ద్వారా ప్రవేశించడానికి అల్లు అరవింద్ బలమైన అడుగులు వేస్తున్నారు. మలయాళం లో అల్లు అర్జున్ విపరీతమైన మార్కెట్ ఉంది. కన్నడ చిత్ర పరిశ్రమలో అల్లు అరవింద్ కు బలమైన పరిచయాలు ఉన్నాయి. అల్లు అరవింద్ ఇప్పటికే అల్లు స్టూడియోస్.. హయ్యండ్ క్వాలిటీస్ తో ఉన్న సినిమా థియేటర్ నిర్మించారు. ఆహా ఓటీటీని ఆయన ఎలా వదులుకుంటారు.. నష్టం వస్తుందని తెలిస్తే.. అందులో పెట్టుబడిని నియంత్రిస్తారు. ఇప్పటికే ఆహాలో ప్రాజెక్టు కే.. సర్కార్ వంటి షో లు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆన్ స్టాపబుల్ వంటి షో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆహా ఓటిటి చేతులు మారడం అనేది అబద్ధం.