Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో విశేషమైన అటెన్షన్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఏపీ రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం పదవి బాధ్యతను కొనసాగిస్తూనే తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫుల్ టైమ్ సినిమాలు చేయడం లేదు. తనకు సమయం దొరికినప్పుడు మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పూర్తిస్థాయి పొలిటిషన్ గా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సినిమాల చాలా శ్రద్ధ పెట్టేవాడు. ఇక ప్రస్తుతం ఆయన సినిమాలకు గ్యాప్ ఇస్తూనే సేవ కార్యక్రమాలను చేస్తున్నాడు. ఆయన చేసే పనులు ప్రజలను విశేషంగా అలరిస్తున్నాయి. దాంతో పాటుగా రాబోయే రోజుల్లో తను సీఎం గా కూడా మారే అవకాశాలైతే ఉన్నాయని చాలామంది చాలా రకాల అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా వింటేజ్ పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ముఖ్య త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేసిన ‘జల్సా’ సినిమా అతని కెరియర్ లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమాకి పీఆర్ఓ గా ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న ఎస్కేఎన్ ఉండటం విశేషం…
తను పవన్ కళ్యాణ్ కాలు లేపిన పోస్టర్ ను డిజైన్ చేయించారట. ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ మాత్రం పవన్ కళ్యాణ్ అలా కాలు లేపితే బాగోదని చెప్పాడట. దానికి ఎస్కేఎన్ అదిరిపోయే విషయాన్ని చెప్పారట. పవన్ కళ్యాణ్ కాలు లేపితే అద్భుతంగా ఉంటుందని తన అభిమానులు చాలా వరకు పండుగ చేసుకుంటారని ఒక అభిమానిగా నేను చెబుతున్నాను నా మాట నమ్మండి అని ఎస్ కే ఎన్ భరోసా ఇచ్చారట.
మొత్తానికైతే ఆ పోస్టర్ జల్సా సినిమాకి ఒక ఐకానిక్ లుక్ ను తీసుకొచ్చింది. జల్సా అనగానే ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ కాలు లేపి నిలబడిన పోస్టర్ గుర్తుకువస్తుంది. మొత్తానికైతే ఎస్కేఎన్ చేసిన స్ట్రాటజీ వర్కౌట్ అయిందని అల్లు అరవింద్ సైతం అతన్ని నమ్మడం స్టార్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ గా మారాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఎస్కేఎన్ టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…