JR NTR fan shyam : ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్ శ్యామ్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. శ్యామ్ మృతి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇది వైసీపీ నేతలు చేసిన పనే అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ నేరుగా సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. శ్యామ్ మరణం అనుమానాస్పదంగా ఉంది. అతడు ఆత్మహత్య చేసుకోలేదు. చంపేశారని టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. దానికి కౌంటర్ గా వైసీపీ సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతుంది.
శ్యామ్ మరణం ప్రకంపనలు రేపుతుండగా ఎన్టీఆర్ స్పందించారు. ఆయన లేఖ విడుదల చేశారు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమన్న ఎన్టీఆర్ అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే శ్యామ్ ఎలా మరణించాడో, అందుకు కారణమైన పరిస్థితులు ఏమిటో తెలియకపోవడం విచారకరం. అధికారులు వెంటనే దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎన్టీఆర్ లేఖలో పేర్కొన్నారు.

అభిమాని మృతిపై విచారణ జరపాలని ఎన్టీఆర్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ధృవీకరించారు. వ్యక్తిగత సమస్యలతో మానసిక వేదన అనుభవిస్తున్న శ్యామ్ మొదట మణికట్టు కోసుకున్నాడు. అనంతరం ఉరి వేసుకుని తన నివాసంలో మరణించినట్లు రిపోర్ట్ లో పేర్కొన్నారు.
శ్యామ్ ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఒక సెల్ఫీ వీడియో చేశాడు. అందులో జాబ్ చేయడం ఇష్టం లేదు. నేను ఎందుకూ పనికిరాను. మిస్ యూ మమ్మి, మిస్ యూ డాడీ అని చెప్పాడు. శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణం వెనుక ఎలాంటి కారణం లేదని పోలీసులు ఈ వీడియో విడుదల చేశారు. అయితే శ్యామ్ సూసైడ్ వీడియో మీద కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ అభిమాని మృతి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.
సుసైడ్ చేసుకోబోయే ముందు శ్యామ్ మాట్లాడిన వీడియో!
శ్యామ్ ఆత్మ కి శాంతి చేకూరాలి, ఈ విషాధ సమయంలో శ్యామ్ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి మరియు శ్యామ్ తోటి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికి మా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాం 🙏🏻
శ్యామ్ కుటుంబ సభ్యులకి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా… pic.twitter.com/DANeXVEgCm
— YSR Congress Party (@YSRCParty) June 27, 2023