Toxic Trailer : గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని గత కొద్దిసేపటి క్రితమే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ మూవీని చూస్తున్నట్టుగా అనిపించింది. ముఖ్యంగా ట్రైలర్ లో యశ్ పాత్రను ఎలివేట్ చేశారు. సినిమా కథ ఏంటో చెప్పకుండానే ప్రతిపాత్రను పరిచయం చేసే ప్రయత్నం చేశారు… ఈ మూవీలో తార సుతారియా, నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక పవర్ ఫుల్ బ్యాక్ స్టోరీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రతి పాత్ర స్క్రీన్ మీద అద్భుతంగా కనిపించారు. ముఖ్యంగా యశ్ తన నట విశ్వరూపాన్ని మరోసారి చూపించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. గీతూ మోహన్ దాస్ దర్శకురాలి గా వ్యవహరిస్తున్న ఈ సినిమా బెస్ట్ విజువల్స్ తో హాలీవుడ్ మేకర్స్ ఏ రేంజ్ లో అయితే తెరకెక్కిస్తారో అలాంటి ఒక స్టాండర్డ్స్ తోనే సినిమాను తీసింది.
ప్రతి పాత్రలో ఉన్న ఇంటెన్స్ ని ట్రైలర్ రూపంలో బయటపెట్టింది. విజువల్స్ కి గాని బ్యా గ్రౌండ్ మ్యూజిక్ గాని టాప్ రేంజ్ లో ఉన్నాయి. మొత్తానికైతే గీతూ మోహన్ దాస్ ఈ సినిమాతో గొప్ప దర్శకురాలిగా మారబోతుందనేది తెలుస్తుంది… ట్రైలర్ మధ్యలో యాక్షన్ ఎపిసోడ్స్ సైతం చాలా టాప్ రేంజ్ లో చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది. యశ్ చాలా ప్రెస్టేజీయాస్ గా తీసుకొని ఈ సినిమాని చేస్తున్నాడు.
కేజీఎఫ్ తర్వాత అతనికి ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. కాబట్టి అతను చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుందని అతని అభిమానులు సైతం భావిస్తున్నారు… కథలో కాన్ఫ్లిక్ట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందనే విషయం చాలా క్లారిటీగా తెలుస్తుంది…ఇక అన్ని బాగానే ఉన్నప్పటికి ట్రైలర్ ని ఇంకొంచెం స్లోగా కట్ చేసి ఉంటే బాగుండేది.
షాట్స్ వస్తు వెళ్ళిపోతున్నాయి. అలాగే కథని కూడా చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండేది. స్టోరీ ఏంటి అనేది అసలు ఎక్కడ కూడా అర్థం అవ్వకుండా ట్రైలర్ కట్ చేశారు… ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం ఆగస్టు 26వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…