PhonePe: భారతదేశంలో ఫోన్ పే యూజర్లకు ఆ కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. నిన్నా.. మొన్నటి వరకు యూపీఐ చెల్లింపులు చేస్తే చార్జీలు వసూలు చేస్తారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. భారత యూజర్ల నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయమని స్పష్టం చేసింది. దీంతో కోట్లాది మంది యూజర్లకు రిలీప్ కానుంది. అసలు ఈ చార్జీలు ఏంటీ? ఎవరు దీనిపై స్పందించారు.
భారత డిజిటల్ చెల్లింపుల రంగంలో యూపీఐ కీలక పాత్ర పోషిస్తోంది. టీ దుకాణం నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు ఎక్కడ చూసినా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న వార్తలు వినియోగదారుల్లో ఆందోళనకు కారణమయ్యాయి. లోక్ సభలోనూ ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007’లో మార్పులు చేసేందుకు పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందింది. ఈ సవరణ ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వం కొన్ని డిజిటల్ పేమెంట్ లావాదేవీలకు ఛార్జీలను అనుమతించే అవకాశం కల్పించింది.
అయితే దీనిపై ఫోన్‌పే సీఈవో సమీర్ నిఘమ్ స్పందించారు. భారతీయ వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేసినట్లు సమాచారం. అంటే ప్రస్తుతం ఫోన్‌పే వంటి యూపీఐ యాప్ ద్వారా ఒక వ్యక్తి మరో వ్యక్తికి డబ్బు పంపినప్పుడు వినియోగదారుడి నుంచి ప్రత్యేక లావాదేవీ రుసుము వసూలు ఉండదని అన్నారు.
అయితే ఇక్కడ చార్జీలు అనేది మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)ద్వారా వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. అంటే వ్యాపారి యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించినప్పుడు పేమేంట్ చార్జీలు పడే అవకాశం ఉండేది. కానీ వినియోగదారుడిపై ఎలాంటి భారం వేయకూడదనే నిర్ణయించారు. అయినా కాస్త గందరగోళం ఉంటున్న నేపథ్యంలో ఫోన్ పే లాంటి సంస్థ వారు క్లారిటీ ఇవ్వడంతో ఆందోళన కు చెక్ పడినట్లయింది.