Fixed Deposit: చాలామంది తమ చేతిలో అదనపు డబ్బు ఉండగానే బ్యాంకులో డిపాజిట్ చేయాలని అనుకుంటారు. అయితే బ్యాంకులో డిపాజిట్ చేయడం వల్ల తక్కువ వడ్డీ రావడంతో పాటు లాంగ్ పీరియడ్లో ఎలాంటి లాభం ఉండదు. అలాగని ఇతర పెట్టుబడులు అంత సురక్షితం కావు. మరి ఇలాంటి సమయంలో చేతిలో ఉన్న డబ్బుతో ఏం చేయాలి? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? అనే దానిపై కొందరు నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
సాధారణంగా ఒక వంద రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.103 అవుతుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే రూ.107 అవుతుంది. కానీ ఏడాది సమయం అయ్యేవరకు మిగతా వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. బ్యాంకులో వచ్చే ఈ లాభం కంటే వస్తువుల ధరలు పెరగడంతో నష్టమే జరుగుతుంది. ఇలాంటప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ తో లాంగ్ పీరియడ్లో పెద్ద లాభం ఉండదు.
కానీ ఇతర పెట్టుబడులకంటే బ్యాంకు డిపాజిట్లు ఎంతో శ్రేయస్కరం. బ్యాంకులో డిపాజిట్ చేస్తే ప్రత్యేకంగా బాండ్ ఇస్తారు. అంతేకాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు తీసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా బ్యాంకులు మోసం చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరి ఇలాంటప్పుడు చేతిలో ఉన్న డబ్బుతో ఏం చేయాలి?
అందరి జీవితాలు ఒకేలా ఉండవు. అందువల్ల అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు. ఇలాంటప్పుడు తమ పరిస్థితులకు అనుగుణంగా డబ్బును సరైన మార్గంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి దగ్గర రూ 500000 నిల్వకు ఉంటే దానిని కనీసం ఐదు నుంచి పది సంవత్సరాల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఎందుకంటే ఇందులో లాంగ్ పీరియడ్లో ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కాకుండా ఈ మొత్తాన్ని ఒకే చోట కాకుండా వివిధ రకాలుగా పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు కొంత మ్యూచువల్ ఫండ్లో.. మరికొంత పబ్లిక్ ఫండ్లో.. ఇంకొంత బ్యాంకు డిపాజిట్ చేసుకోవాలి.
ఇలా పెట్టు పనులను విభజించడం వల్ల అత్యవసరానికి బ్యాంకు డిపాజిట్ తీసుకోవచ్చు. లాంగ్ మ్యూచువల్ ఫండ్ వంటి ఇతర వాటిలో పెట్టుబడులు పెట్టిన దానిని లాంగ్ పీరియడ్లో ఉపయోగించుకోవచ్చు. అందువల్ల చేతిలో డబ్బు నిల్వ ఉన్నవారు ఓకే విషయంపై ఆలోచించకుండా పెట్టుబడులపై అవగాహన పెంచుకోవాలి. రకరకాల మార్గాల ద్వారా పెట్టుబడులు పెడితేనే అత్యధికంగా లాభాలు పొందడంతో పాటు డబ్బులు సేఫ్గా ఉంచుకోగలుగుతారు.