Homeఆధ్యాత్మికంVaralakshmi Vratam 2026: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేయాలి? ఆగస్టు 21నా.. 28నా?

Varalakshmi Vratam 2026: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేయాలి? ఆగస్టు 21నా.. 28నా?

Varalakshmi Vratam 2026: ఆషాఢ మాసం తరువాత శ్రావణ మాసం వస్తుంది. ఈ మాసంలో పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే శుక్రవారానికి ప్రత్యేకత ఉంటుంది. ఈ శుక్రవారాల్లో మహిళలు మహాలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. వీటిలో వరలక్ష్మీ వ్రతానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. అయితే ఈ ఏడాది శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు రావడంతో పాటు, పౌర్ణమి తిథి కూడా శుక్రవారం రోజున రావడంతో వరలక్ష్మీ వ్రతాన్ని ఏ తేదీన […]

Varalakshmi Vratam 2026: ఆషాఢ మాసం తరువాత శ్రావణ మాసం వస్తుంది. ఈ మాసంలో పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే శుక్రవారానికి ప్రత్యేకత ఉంటుంది. ఈ శుక్రవారాల్లో మహిళలు మహాలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. వీటిలో వరలక్ష్మీ వ్రతానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. అయితే ఈ ఏడాది శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు రావడంతో పాటు, పౌర్ణమి తిథి కూడా శుక్రవారం రోజున రావడంతో వరలక్ష్మీ వ్రతాన్ని ఏ తేదీన ఆచరించాలనే విషయంలో భక్తుల్లో సందేహం నెలకొంది.అసలు వరలక్ష్మీ వ్రతాన్ని ఎప్పుడు జరుపుకోవాలంటే?

సాధారణంగా శ్రావణ మాసంలోని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. స్కంద పురాణం సహా పలు ధర్మగ్రంథాలు కూడా ఈ విధానాన్ని సూచిస్తున్నట్లు పండితులు చెబుతున్నారు.
ధర్మశాస్త్రాల్లోని నియమాల ప్రకారం.. పౌర్ణమి తిథి శుక్రవారం రోజును స్పృశించినప్పుడు ‘నోపాంతే భార్గవాదినే’ అనే ధర్మనియమాన్ని పరిగణనలోకి తీసుకుంటారని పండితులు వివరిస్తున్నారు. ఈ నియమం ఆధారంగా పౌర్ణమితో కూడిన శుక్రవారం రోజున కూడా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చని పలువురు పంచాంగకర్తలు చెబుతున్నారు. దీని ప్రకారం ఉదయం పూజా విధానాన్ని అనుసరించే భక్తులు 28 ఆగస్టు 2026 శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం శాస్త్రసమ్మతమే అని వారు సూచిస్తున్నారు.

అయితే అన్ని ప్రాంతాల్లో.. అన్ని కుటుంబాల్లో వరలక్ష్మీ వ్రత పూజా విధానం ఒకే విధంగా ఉండదు. కొన్ని సంప్రదాయాల్లో సాయంకాలంలో ప్రధాన పూజ నిర్వహించడం ఆనవాయితీగా ఉంటుంది. ముఖ్యంగా శృంగేరి శ్రీ శారదా పీఠం సంప్రదాయాన్ని అనుసరించే భక్తులకు ఈ విషయంలో ప్రత్యేకంగా సూచనలు ఉన్నాయి.ఆగస్టు 28న సాయంత్రం పౌర్ణమి తిథి అందుబాటులో ఉండని పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, సాయంకాల పూజా సంప్రదాయాన్ని అనుసరించేవారు ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం శ్రేయస్కరం అని సూచిస్తున్నారు.

హిందూ ధర్మంలో వ్రతాలు, పూజలకు తిథి, నక్షత్రం, లగ్నం వంటి అంశాలతో పాటు కుటుంబ ఆచారం, ప్రాంతీయ సంప్రదాయం కూడా ప్రాధాన్యం కలిగి ఉంటాయి. అందువల్ల తరతరాలుగా ఏ విధానాన్ని అనుసరిస్తున్నారో తెలుసుకుని అదే పద్ధతిలో వ్రతాన్ని ఆచరించడం మంచిదని ఆధ్యాత్మిక పెద్దలు సూచిస్తున్నారు.ముఖ్యంగా ఒకే వ్రతానికి సంబంధించి వేర్వేరు పంచాంగాల్లో తేదీలు కనిపిస్తే, తమ ప్రాంతానికి వర్తించే పంచాంగాన్ని, కుటుంబ పురోహితుల సూచనలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper