Homeఎంటర్టైన్మెంట్NTR: ఎన్టీఆర్ ను కొట్టిన గురువు... ఆయన వల్లే తారక్ మారాడా...

NTR: ఎన్టీఆర్ ను కొట్టిన గురువు… ఆయన వల్లే తారక్ మారాడా…

NTR: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు తమ సత్తా చాటుకుంటూ ముందుకు సాగాలని చూస్తారు. ఇండస్ట్రీలో వారసత్వం ఉన్నంత మాత్రాన అవకాశాలు వస్తాయి కావచ్చు కానీ సక్సెస్ మాత్రం రావు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళలో కొంతమంది హీరోలు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా నిలదొక్కుకుంటే మరికొంతమంది మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ ఔట్ అయిపోతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా నందమూరి ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి వచ్చిన జూనియర్ […]

NTR: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు తమ సత్తా చాటుకుంటూ ముందుకు సాగాలని చూస్తారు. ఇండస్ట్రీలో వారసత్వం ఉన్నంత మాత్రాన అవకాశాలు వస్తాయి కావచ్చు కానీ సక్సెస్ మాత్రం రావు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళలో కొంతమంది హీరోలు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా నిలదొక్కుకుంటే మరికొంతమంది మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ ఔట్ అయిపోతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా నందమూరి ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఆయన్ని టాప్ పొజిషన్ లో నిలబెడితే ఇకమీదట రాబోయే సినిమాలతో ఆయన పాన్ ఇండియాలో సైతం తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ ని తన గురువు కొట్టాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇంతకీ వాళ్ళ గురువు ఎవరు అతన్ని ఎందుకు కొట్టాడు అంటే చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ భరతనాట్యం నేర్చుకుంటున్న క్రమంలో అల్లరి చిల్లరగా ఉండేవాడట. దాంతో వాళ్ళ గురువు చెప్పిన స్టెప్స్ ని అంత ఎఫెక్టివ్ గా వేయలేకపోయేవాడట.

దాంతో ఆయన ఎన్టీఆర్ ని కొట్టి మరి అతని చేత పర్ఫెక్ట్ మూమెంట్స్ ని వేయించేవాడట. దాంతో జూనియర్ ఎన్టీఆర్ భరతనాట్యంలో ఆరితేరాడు. ఆ తర్వాత ఆయన చాలా వరకు స్టేజ్ పెర్ఫార్మెన్స్ లను కూడా ఇచ్చాడు. అందుకే అతను ఇప్పుడు ఎలాంటి స్టెప్పులనైనా సరే ఒక్కసారి చూసి చేసేస్తూ ఉంటాడు.

వాళ్ల గురువుగారు అప్పుడు ఆయన్ని కొట్టి మరి డ్యాన్స్ నేర్పించాడు కాబట్టే తను ఈరోజు ఈ స్థానంలో ఉన్నానని ఎన్టీఆర్ పలు సందర్భాల్లో చెబుతుంటాడు…ఇక జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా వేసి మెప్పించగలుగుతాడు. సాధ్యమైనంత వరకు సింగిల్ టేక్ లోనే తన పర్ఫామెన్స్ ని పూర్తి చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి నటుడు కూడా తనే కావడం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper