NTR Dragon Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొనడం లేదు. రీసెంట్ గా ఆయనకు షోల్డర్ ఇంజురీ అవ్వడంతో ఆయన కొద్ది వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో మేకర్స్ ఏం చేయాలో తెలియక చాలా వరకు కన్ఫ్యూషన్ లో పడ్డారు. సినిమా రిలీజ్ డేట్ అయితే ఇచ్చేసారు కాబట్టి అనుకున్న డేట్ కి సినిమాని రిలీజ్ చేయగలమా లేదా అనే ఒక డైలమాలో వాళ్లు ఉన్నారు. ఎన్టీఆర్ కి ఇంజురీ అవ్వకపోతే ఈ రెండు నెలల్లోనే ఎన్టీఆర్ పోర్షన్ మొత్తాన్ని సూట్ చేయాలని డైరెక్టర్ అనుకున్నప్పటికి అది వర్కౌట్ కాలేక పోతుంది. దానివల్ల ప్రశాంత్ నీల్ అండ్ టీం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
ఎన్టీఆర్ లేకపోయినా కూడా ఆయన లేని సన్నివేశాలు ఇతర ఆర్టిస్టుల సీన్స్ ని షూట్ చేసి ఎన్టీఆర్ వచ్చాక అతని కాంబినేషన్స్ ను తెరకెక్కిస్తే సరిపోతుంది కదా అనే ధోరణిలోనే ఆలోచిస్తున్నారట. నిజానికి ఇప్పుడు రిలీజ్ డేట్ అనేది చాలా కీలకంగా మారింది. ఒకసారి ఒక సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేసాము అంటే ఆ సినిమా ఆ టైం కి రాకపోతే సినిమా మీద అంచనాలు తగ్గిపోతున్నాయి.
కాబట్టి అనుకున్న డేట్ కి సినిమాలను రిలీజ్ చేయడమే ఇప్పుడు ఉత్తమమని ప్రతీ సినిమా మేకర్ భావిస్తున్నాడు. దానికి తోడుగా రీసెంట్ గా హాలీవుడ్ డైరెక్టర్ అయిన క్రిస్టోఫర్ నోలన్ తీసిన ‘ది ఒడిస్సీ’ సినిమా సంవత్సరం క్రితమే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి పర్ఫెక్ట్ గా అనుకున్న డేట్ కి రిలీజ్ చేయడం వల్ల హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం రిలీజ్ డేట్ ని ఫాలో అవుతున్నారు.
ఇండియన్ సినిమా మేకర్స్ కి ఏమైంది అంటూ కొన్ని విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు స్టార్ హీరోల రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేస్తే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశమైతే ఉంది. అందుకోసమే ప్రశాంత్ నీల్ ఈ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…