NTR And Ram Charan: స్టార్ హీరోలు ఈమధ్య కాలం లో ఎక్కువగా థియేటర్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో స్టార్ హీరోలు ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ తో కలిసి థియేటర్స్ ని ప్రారంభిస్తున్నారు. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో ‘ AMB సినిమాస్’ ని మొదలు పెట్టారు. ఇది పెద్ద హిట్ అవ్వడం తో , హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో ‘సత్యం’ థియేటర్ స్థానం ‘AAA సినిమాస్’ ని ప్రారంభించారు. అల్లు అర్జున్ తో కలిసి నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ కి కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు మాస్ మహారాజ రవితేజ తో కలిసి ‘ఆర్ట్ సినిమాస్’ మొదలు పెట్టగా , విజయ్ దేవరకొండ తో మహబూబ్ నగర్ లో ‘AVD సినిమాస్’ ని మొదలు పెట్టారు సునీల్ నారంగ్.
ఇప్పుడు #RRR హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు కూడా థియేటర్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టే ఆలోచన లో ఉన్నారట. ఏషియన్ సునీల్ తో కలిసి రామ్ చరణ్ ‘ARC సినిమాస్’ ని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు రానున్నాయి. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ గచ్చిబౌలి ప్రాంతం లో ఒక ప్రీమియం మల్టీప్లెక్స్ ని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట. అయితే అది ఏషియన్ సునీల్ తో కలిసి మొదలు పెడుతారా?, లేదంటే సొంతంగా మొదలు పెడుతారా అనే విషయం పై క్లారిటీ రావల్సి ఉంది. ఇలా ఒక్క పవన్ కళ్యాణ్ , ప్రభాస్ తప్ప, అందరూ స్టార్ హీరోలు హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ థియేటర్స్ ని కడుతున్నారు. వీళ్లిద్దరు కూడా ఈ రంగం లోకి అడుగుపెడితే బాగుంటుందని అంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే హీరోలు ఇలా థియేటర్స్ వ్యాపారం లోకి రావడం వల్ల, వాళ్లకు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ కారణంగా హైదరాబాద్ లో ఫుట్ ఫాల్స్ భారీగా పెరుగుతున్నాయి. టాక్ తో సంబంధం లేకుండా వీళ్ళ థియేటర్స్ నుండి వస్తున్నా వసూళ్లను చూస్తే మతి పోవాల్సిందే. ‘AMB సినిమాస్’ అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాప్తి చెందుతోంది. రీసెంట్ గానే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సిటీ లో ‘AMB సినిమాస్’ ని మొదలు పెట్టారు. త్వరలోనే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా ‘AMB సినిమాస్’ రానుంది. అదే విధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా హైదరాబాద్ లోని కోకాపేట లో ‘అల్లు సినిమాస్’ ని రీసెంట్ గానే మొదలు పెట్టారు. ఇక భవిష్యత్తులో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు నిర్మించబోయే థియేటర్లు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.