Homeఎంటర్టైన్మెంట్Roller Raghu: జూనియర్ ఎన్టీఆర్ జోలికి వస్తే ప్రాణాలు తీసేస్తా అంటూ టాప్ కమెడియన్...

Roller Raghu: జూనియర్ ఎన్టీఆర్ జోలికి వస్తే ప్రాణాలు తీసేస్తా అంటూ టాప్ కమెడియన్ వార్నింగ్..

Roller Raghu: ప్రతీ స్టార్ హీరో కి బయట మాత్రమే కాదు , ఇండస్ట్రీ లో కూడా వీరాభిమానులు ఉంటారు. వాళ్ళ కారణంగా సినిమాల్లో అవకాశం రావడం వల్లనో , లేదంటే వ్యక్తిగతంగా సహాయం పొందడం వల్లనో, వీళ్ళు సదరు హీరోలకు భక్తులుగా వ్యవహరిస్తుంటారు. అలా మన ఇండస్ట్రీ లో జూనియర్ ఎన్టీఆర్ కి సినీ సెలబ్రిటీలలో చాలా మంది భక్తులే ఉన్నారు. అందులో రోలర్ రఘు ఒకరు. కమెడియన్ గా ఇండస్ట్రీ లో ఎన్నో సూపర్ […]

Roller Raghu: ప్రతీ స్టార్ హీరో కి బయట మాత్రమే కాదు , ఇండస్ట్రీ లో కూడా వీరాభిమానులు ఉంటారు. వాళ్ళ కారణంగా సినిమాల్లో అవకాశం రావడం వల్లనో , లేదంటే వ్యక్తిగతంగా సహాయం పొందడం వల్లనో, వీళ్ళు సదరు హీరోలకు భక్తులుగా వ్యవహరిస్తుంటారు. అలా మన ఇండస్ట్రీ లో జూనియర్ ఎన్టీఆర్ కి సినీ సెలబ్రిటీలలో చాలా మంది భక్తులే ఉన్నారు. అందులో రోలర్ రఘు ఒకరు. కమెడియన్ గా ఇండస్ట్రీ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రఘు కి దాదాపుగా ప్రతీ ఒక్క హీరోతోనూ మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ‘ఆది’ చిత్రం తో ఈయన వెండితెర అరంగేట్రం చేశారు. ఆ తర్వాత వీవీ వినాయక్ తెరకెక్కించిన ప్రతీ సినిమాలోనూ రఘు కనిపించేవారు. అలా బాగా ఫేమస్ అవ్వడంతో దాదాపుగా 150 సినిమాల్లో కమెడియన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా , ‘జబర్దస్త్’ వంటి పాపులర్ కామెడీ షోస్ లో కూడా ఈయన కంటెస్టెంట్ గా వ్యవహరించారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్న ఈయన జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని. ఈమధ్య కాలం లోనే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ అంటే తనకు ఎలాంటి అభిమానం ఉందో చెప్పుకొచ్చారు రఘు. ఆయన మాట్లాడుతూ ‘జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రాణాలు ఇవ్వడమే కాదు , ప్రాణాలు కూడా తీసేస్తా’ అంటూ చెప్పుకొచ్చారు. అప్పుడు యాంకర్ షాక్ కి గురై , నిజామా అని అడిగితే ‘ నిజం భాయ్, ఎవరైనా ఆయన మీద కామెంట్ చేసినట్టు చెప్పి నా దగ్గరకి తీసుకొని రా , 24 గంటల్లోనే పని పూర్తి చేస్తా, హైదరాబాద్ అసలే మాది’ అంటూ చెప్పుకొచ్చారు రఘు. అప్పుడు యాంకర్ ‘ఆమ్మో..ఎన్టీఆర్ సార్.. దయచేసి నన్ను ఏమి చేయొద్దని చెప్పండి ఇతనికి’ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తాడు.

అప్పుడు రఘు మాట్లాడుతూ ‘అలా అని కాదు , నాకు ఆయనంటే అంత ఇష్టమని చెప్తున్నాను అంతే. మొదటి నుండి నాకు ఆయనతో ఉన్న కనెక్షన్ అలాంటిది’ ఇంకా ఆయన ఏమి మాట్లాడారో ఈ క్రింది వీడియో లో చూడండి. ఎన్టీఆర్ తో ఇప్పటి వరకు రఘు ఆది, అదుర్స్ , బృందావనం , ఊసరవెల్లి , రభస, టెంపర్ వంటి చిత్రాలు చేశారు. దాదాపుగా అన్నీ కమర్షియల్ గా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇకపోతే ఈ ఏడాది ఆయన ‘సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసనీ’ చిత్రం లో నటించారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper