Trivikram Srinivas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద బ్యానర్లలో సితార ఎంటర్టైన్మెంట్ ఒకటి… ప్రొడ్యూసర్ నాగ వంశీ ఈ బ్యానర్ లో భారీ సినిమాలను తెరకెక్కిస్తూ బ్యానర్ యొక్క క్రెడిబిలిటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఈ బ్యానర్ లో భాగమైనట్టుగా తెలుస్తుంది. తన భార్య అయిన సాయి సౌజన్య ని ఈ ప్రొడక్షన్ సంస్థలో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా మార్చాడు. నిజానికి త్రివిక్రమ్ ఇందులో ఎంతవరకు పెట్టు బదులు పెడుతారు? ఎంత వరకు లాభాలను ఆర్జిస్తున్నాడు అనే విషయంలో సరైన క్లారిటి లేదు.
కానీ మొత్తానికైతే త్రివిక్రమ్ ఈ బ్యానర్ లో చేసే ప్రతి సినిమా కథని తను విని అందులో మార్పులు చేర్పులను చేసి దాన్ని ఫైనల్ చేస్తారట. అతను సినిమాల్లో ప్రత్యేకంగా డబ్బులు పెట్టకపోయిన కూడా సినిమాకి కథపరంగా మాటలపరంగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు.
కాబట్టి అతని వైఫ్ అయిన సాయి సౌజన్యని వన్ అఫ్ ది ప్రొడ్యూసర్ గా ఆడ్ చేశారట. ఇక ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి దాదాపు 20 నుంచి 30 శాతం వరకు ఈ బ్యానర్ లో వాటా ఉన్నట్టుగా తెలుస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్నాడు. ఇక మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడు. పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించే విధంగా ఈ మూవీ ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే డైలాగులకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. అతని డైలాగుల కోసం చాలా మంది ప్రేక్షకులు అతని సినిమాలను చూడటానికి ఇష్టపడుతుంటారు. పాన్ ఇండియాలో ఉన్న ప్రేక్షకులు డైలాగులకు పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి మేకింగ్ మీద ఆయన ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరమైతే ఉందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…