Australia Vs Pakistan
Australia Vs Pakistan: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలలో అల్లు అర్జున్ ఒకరు ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకున్నాయి . ఇక దానికి తోడు సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా మంచి సక్సెస్ ని అందుకోవడం తో పాటు గా ఇండియా లోనే ఈ సినిమా భారీ కలక్షన్స్ ని రాబట్టింది. ఇక దానికి తోడు ఈ సినిమా కి ప్రస్తుతం సీక్వెల్ కూడా వస్తుంది అనే విషయం మనకు తెలిసిందే ఇక ఈ సినిమా కి సంభందించిన చిన్న టిజర్ ని కూడా మనం ఈమధ్య చూడటం జరిగింది…అది కూడా చాలా అద్బుతం గా ఉంది.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా వచ్చినప్పటి నుండి అప్పట్లో కొన్ని నెలల వరకు అదే మ్యానియా నడిచింది.ఇక దానికి తగ్గట్టు గానే వరల్డ్ లో ఉన్న ఫేమస్ క్రికెటర్లు కానీ ఫేమస్ ఆర్టిస్ట్ లు కానీ అందరూ ఆ సినిమా కు సంభందించిన సాంగ్స్ ని రీల్స్ గా చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా అలరించారు.ఇక దాంతో ఈ సినిమా రేంజ్ ఒక్కసారి గా వరల్డ్ వైడ్ కీ వెళ్ళిపోయింది. ఇక అందులో ముఖ్యంగా డ్వెన్ బ్రావో, వార్నర్ లాంటి వాళ్ళు చాలా బాగా రీల్స్ చేస్తూ ఈ సినిమా సాంగ్స్ ని పాపులర్ చేశారు. ఇక ఇది ఇలా ఉంటే వరల్డ్ కప్ లో భాగం గా అన్ని జట్లు వార్మప్ మ్యాచు లు ఆడుతున్నాయి. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా పాకిస్థాన్, ఆస్ట్రేలియా ల మధ్య ఒక వార్మాప్ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో ఒక అరుదైన సంఘటన జరిగింది అదేంటి అంటే బౌండరీ వెళ్ళబోతున్న బాల్స్ ను పట్టుకోబోయిన వార్నర్ దానిని ఆపేసి మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టు గా పుష్ప మ్యానరిజం ని చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు…
ఇక దాంతో పుష్ప సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది…
ఈ సంఘటన తో ప్రస్తుతం పుష్ప 2 సినిమా మీద అంచనాలు మళ్ళీ భారీ గా పెరిగాయి…ఇలా వరల్డ్ కప్ కి ముందు వార్నర్ మన తెలుగు హీరో మ్యనరిజంస్ తో ఆకట్టుకోవడం చూసిన తెలుగు సినిమా అభిమానులు సైతం ఆనందపడిపోతున్నారు…ఇక వరల్డ్ కప్ లో భాగంగా మన ఇండియా కి ఆస్ట్రేలియా కి మధ్య ఈనెల 8 వ తేదీన మొదటి మ్యాచ్ జరగనుంది…
ఇక ఈ మ్యాచ్ తర్వాత ఇండియా ఆఫ్గనిస్తాన్ తో ఒక మ్యాచ్ ఆడనుంది అలాగే దాని తర్వాత పాకిస్థాన్ తో ఈ నెల 14 వ తేదీన మరో మ్యాచ్ ఆడనుంది.
ఇక దానికి తగ్గట్టు గానే ఇండియా చాలా కసరత్తులు కూడా చేస్తుంది. ఇక దానికి తోడు మన ఇండియన్ ప్లేయర్లు అందరూ కూడ వాళ్ల కంటు సెపరేట్ ఫామ్ ని కొనసాగిస్తూ ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లు గా మారాలనే ఉద్దేశ్యం తో మ్యాచ్ లు ఆడాలని చూస్తున్నారు…ఇక ఈ మ్యాచ్ లకి కే ఎల్ రాహుల్, శభ్ మన్ గిల్,కోహ్లీ రోహిత్ శర్మ లు చాలా కీలకంగా మారబోతున్నారు.ఇక వీళ్లతో పాటు సిరజ్ బుమ్రా లాంటి వారు బౌలింగ్ లో చాలా కీలకంగా మరబోతున్నారు…
PushpaRaj fever In world Cup warm-up match. HYD
This time warner doing the mannerism at @alluarjun‘s fort.. #AUSvPAK pic.twitter.com/dgXrvBMnz2
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) October 3, 2023