Homeక్రీడలుPakistan Players: మీ మొహాలు మండ.. పరుపులపై ఫీల్డింగ్ ప్రాక్టీస్ ఏంట్రా బాబూ..

Pakistan Players: మీ మొహాలు మండ.. పరుపులపై ఫీల్డింగ్ ప్రాక్టీస్ ఏంట్రా బాబూ..

Pakistan Players: “గుట్టలెక్కారు.. పుట్టలను దాటారు. కఠినమైన పర్వతాలను అధిరోహించారు.” టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు ఇలా చాలా కసరత్తులే చేశారు. కానీ వరల్డ్ కప్ లో ఏం జరిగింది? పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెట్టిన ఖర్చు మొత్తం బూడిదలో పోసిన పన్నీరయింది. కనీసం పాకిస్తాన్ జట్టు గ్రూప్ -8 దశను కూడా చేరుకోలేకపోయింది. మరింత దారుణంగా అమెరికా చేతిలో ఓడిపోయింది.. ఈ క్రమంలో త్వరలో ఆ జట్టు వేదికగా చాంపియన్స్ ట్రోఫీ (వేదిక మారే అవకాశం ఉంది) జరగనుంది. ఈ క్రమంలో స్వదేశంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ని ఎలాగైనా దక్కించుకోవాలని పాకిస్తాన్ జట్టు భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇక ఇటీవల టి20 వరల్డ్ కప్ లో దారుణమైన ప్రదర్శన చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ఆ విమర్శలకు చెక్ పెట్టే విధంగా పాకిస్తాన్ క్రికెటర్లు గడాఫీ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కానీ అది కూడా వివాదాస్పదమైంది.

టి20 వరల్డ్ కప్ లో అమెరికా, భారత్ చేతిలో దారుణమైన పరాజయాలు చవి చూసిన నేపథ్యంలో పాకిస్థాన్ ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ మాత్రం దానికి ఆర్మీతో ట్రైనింగ్ అవసరమా అంటూ ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియా వేదికగా దెప్పి పొడిచారు. అయితే ఈ ఓటమి నుంచి బయటికి వచ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. గడాఫీ స్టేడియంలో మెత్తటి పరుపులు వేసి.. వాటిపై పడుతూ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ వీడియోలో పాకిస్తాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ పాత పరుపుల మీద డైవ్ చేస్తూ క్యాచ్ లు అందుకోవడం చర్చకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.

“ఆర్మీతో ట్రైనింగ్ తీసుకున్నారు. గుట్టలెక్కారు. రకరకాల విన్యాసాలు చేశారు. చివరికి గ్రూప్ దశలోనే ఇంటికి వచ్చారు. మా వాళ్లకు అమెరికా ఆర్మీ తో ట్రైనింగ్ ఇచ్చినా పెద్దగా ఉపయోగ ఉండదు”

“మైదానంలో క్రికెట్ ఆడాలంటే శారీరక దృఢత్వం ఉండాలి. ఇలా పరుపుల పై పడుతూ ఉంటే వస్తుందా? అసలు ఆటపై ఏమాత్రం ప్రేమ కనిపించడం లేదు. ఇలాంటి వాళ్లు కప్ లు ఏం తీసుకొస్తారు?”.

” పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పనితీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఇలాంటి బుర్ర తక్కువ నిర్ణయాల వల్ల ఆటగాళ్లు మరింత పరువు కోల్పోతున్నారు. ముందు ఇలాంటి విధానాలకు స్వస్తి పలికితే చాలా మంచిది.”

“అసలు మైదానంలో పరుపులు వేయాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది? మీ మొహాలు మండా.. పరుపులపై ఫీల్డింగ్ ప్రాక్టీస్ ఏంట్రా బాబూ.. సిగ్గు లేకపోతే సరి”.

“ప్రపంచంలోనే క్రికెట్ అత్యంత ధనికమైన క్రీడ. ఈ క్రీడ ఆడేవాళ్లు పాతపరపులపై ప్రాక్టీస్ చేయడం ఏంటో ఏమాత్రం అర్థం కావడం లేదు.. పాకిస్తాన్ తర్వాత ఆడే మ్యాచ్ లలో మైదానాలలో పరుపులతో నింపేస్తారేమో”.

“ఇలా మ్యాట్రెస్ పై ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయడం కంటే.. గ్రౌండ్ లో ఉన్న గడ్డి మీద విన్యాసాలు చేయడం మంచిది. ఇలా చేసుకుంటూ వెళ్తే క్రికెట్ లో పాకిస్తాన్ ఎన్నటికి విజయవంతం కాదు.”

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular