Homeఅంతర్జాతీయంMark Zuckerberg: అమెరికా ఇండిపెండెన్స్ డే.. వెరైటీగా జరుపుకున్న మెటా సీఈఓ

Mark Zuckerberg: అమెరికా ఇండిపెండెన్స్ డే.. వెరైటీగా జరుపుకున్న మెటా సీఈఓ

జులై 4న అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖులు వేడుకలు నిర్వహించుకున్నారు. అందులో భాగంగా మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఒక చేతిలో బీర్ బాటిల్, మరో చేతిలో అమెరికా జెండాతో నీటిపై హైడ్రోఫాయిల్(నీటిపై కదలడం) చేశారు.

Mark Zuckerberg: అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ జులై 4న వినూత్నంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

జులై 4న అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖులు వేడుకలు నిర్వహించుకున్నారు. అందులో భాగంగా మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఒక చేతిలో బీర్ బాటిల్, మరో చేతిలో అమెరికా జెండాతో నీటిపై హైడ్రోఫాయిల్(నీటిపై కదలడం) చేశారు. ఇందులో మార్క్ బ్లాక్ యాప్రాన్, వైట్ షర్ట్ ధరించారు. కళ్లకు బ్లాక్ గాగుల్స్ పెట్టి అదిరిపోయే పోజు ఇచ్చారు. ఈ వీడియోను ఫేస్బుక్, ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తూ ‘హ్యాపీ బర్త్ డే అమెరికా’ అని రాశారు.

జుకర్బర్గ్ ఆరు నెలల కిందట మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ)లో శిక్షణ పొందుతున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడ్డారు. దాంతో తన మోకాలికి తీవ్ర గాయమై శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవల కోలుకున్న మార్క్ తన 40వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జురుపుకున్నారు. తాజాగా ఇలా హైడ్రోఫాయిల్ చేయడంతో తన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mark Zuckerberg (@zuck)

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper