HomeతెలంగాణKCR: కేసీఆర్‌కు శనిలా మారిన సెంటిమెంటు.. వెక్కిరిస్తున్న లక్కీ నంబర్‌!

KCR: కేసీఆర్‌కు శనిలా మారిన సెంటిమెంటు.. వెక్కిరిస్తున్న లక్కీ నంబర్‌!

KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు సెంటిమెంట్లు ఎక్కువ. ఆయన ఏ పని చేసిన ముహూర్తం చూసుకుని చేస్తారు. ఇక తన లక్కీ నంబర్‌ కలిసి వచ్చేలా చూసుకుంటున్నారు. తన జాతకానికి అనుకూలంగా ఉంటేనే ఆ పని చేస్తారు. లేదంటే చేయరు. తన జాతయానికి కలిసి వచ్చేలా హరితహారంలో కదంబ వృక్షం నాటారు. తన లక్కీ నబర్‌ 6 కలిసి వచ్చేలా తెలంగాణలో జిల్లాల పునర్విభజన చేశారు. తన లక్కీ నంబర్‌ ప్రకారమే అసెంబ్లీ సీట్లు ప్రకటించారు. ఇక ఎన్నికల వేళలో యాగాలు, పూజలు చేయడం ఆయనకు అలవాటే. అయితే ఇప్పుడు కేసీఆర్‌ నమ్ముకున్న సెంటిమెంటే ఆయనకు శనిలా మారింది. లక్కీ నంబరే గులాబీ బాస్‌ను వెక్కిరిస్తోంది.

అచ్చిరాని ఆరు నంబర్‌..
ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ మొదలు పెట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆకర్షితులవుతున్నారు. ప్రత్యర్ధి వ్యూహమో, యాదృచ్చికమో తెలియదు కానీ కేసీఆర్‌ బలంగా విశ్వసించే లక్కీనంబర్‌ ప్రకారమే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారు. దీంతో ఆయన నమ్ముకున్న లక్కీ నంబరే ఇప్పుడు కేసీఆర్‌ను కలవరపెడుతోంది. కేసీఆర్‌ లక్కీ నంబరే బీఆర్‌ఎస్‌ను బలహీన పనుస్తోంది.

‘ఆరు’ గ్యారంటీలు..
కేసీఆర్‌ నమ్ముకున్న ఆరు సంఖ్య 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది. ఆరు గ్యారంటీల హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లిన కాంగ్రెస్‌ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక ఇప్పుడు అదే ఆరు నంబర్‌ ప్రకారం.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లాం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌కుమార్, కాలె యాదయ్య అధికార పార్టీలో చేరారు. ఇక గురువారం అర్ధరాత్రి(జూన్‌ 4న) ఆరుగురు ఎమ్మెల్సీలు.. దండె విఠల్, భానుప్రసాద్‌రావు, ఎంఎస్‌.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య హస్తం తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

ఆరుగురు గైర్హాజరు..
ఇక తాజాగా జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో శుక్రవారం(జూలై 5న) సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి కూడా ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, కృష్ణరావు, రాజశేఖరరెడ్డి, వివేకానంద సమావేశానికి హాజరు కాలేదు.

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌కు ఆయన లక్కీ నంబర్‌తోనే ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నట్లు అర్థమవుతోంది. దీంతో ఆయన లక్కీ నంబరే రివర్స్‌ అయినట్లు కనిపిస్తోంది. కేసీఆర్‌ అదృష్టంగా భావించిన ఆరు నంబరే ఇప్పుడు ఆయనను వెక్కిరిస్తోందన్న సెటైర్లు పేలుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular