Homeవింతలు-విశేషాలుFather Checks Groom Character: అల్లుడు క్యారెక్టర్ తెలుసుకునేందుకు మామ చేసిన పనికి పోలీసుల ఫిదా!

Father Checks Groom Character: అల్లుడు క్యారెక్టర్ తెలుసుకునేందుకు మామ చేసిన పనికి పోలీసుల ఫిదా!

Father Checks Groom Character: అల్లారుముద్దుగా పెంచుకునే ఆడపిల్లలను అత్తారింటికి పంపించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. అల్లుడు మంచివాడా? కాదా? అని నిర్ధారించుకుని పిల్లను ఇవ్వాలి. లేకుంటే జీవితాంతం ఇక్కట్లు తప్పవు. కొందరు కారు ఉందని.. ఆస్తులు ఉన్నాయని.. పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని.. ఇలా రకరకాల ఆశలతో పిల్లలను ఇస్తారు. తీరా వారి దాంపత్య జీవితంలో ఎన్నెన్నో అపార్ధాలు, విభేదాలు పుడతాయి. చివరకు విడాకులు వరకు వెళ్తారు. మరికొందరు బలవన్మరణాలకు పాల్పడతారు. సమాజంలో ఇటువంటివి చూసిన […]

Father Checks Groom Character: అల్లారుముద్దుగా పెంచుకునే ఆడపిల్లలను అత్తారింటికి పంపించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. అల్లుడు మంచివాడా? కాదా? అని నిర్ధారించుకుని పిల్లను ఇవ్వాలి. లేకుంటే జీవితాంతం ఇక్కట్లు తప్పవు. కొందరు కారు ఉందని.. ఆస్తులు ఉన్నాయని.. పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని.. ఇలా రకరకాల ఆశలతో పిల్లలను ఇస్తారు. తీరా వారి దాంపత్య జీవితంలో ఎన్నెన్నో అపార్ధాలు, విభేదాలు పుడతాయి. చివరకు విడాకులు వరకు వెళ్తారు. మరికొందరు బలవన్మరణాలకు పాల్పడతారు. సమాజంలో ఇటువంటివి చూసిన ఓ పెద్దాయన.. తన కాబోయే అల్లుడు గురించి ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు. వారితోనే అతడి క్యారెక్టర్ ను విచారించి.. సరైన వ్యక్తి అని నిర్ధారించుకుని పిల్లను ఇచ్చాడు.

* కుమార్తె కోసం..
కాకినాడ జిల్లా రాయుడుపాలెం కు చెందిన ఓ పెద్దాయనకు ఒక్కగానొక్క కుమార్తె ఉంది. ఆయన భార్య చనిపోవడంతో కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. సమాజంలో జరుగుతున్న దుష్పరిణామాలను చూస్తున్న ఆయన సరైన వరుడు వస్తే తన పిల్లను వివాహం చేయాలని భావించాడు. ఇటీవల ఒక పెళ్లి సంబంధం వచ్చింది. కానీ వరుడి క్యారెక్టర్ తెలుసుకునేందుకు ఆయన ఒక వినూత్న ఆలోచన చేశాడు. సాధారణంగా మద్యం అలవాటు ఉంటే తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉంటాయి. దూకుడు గల వ్యక్తి అయితే కచ్చితంగా ట్రాఫిక్ ఆంక్షలు దాటి వ్యవహరిస్తాడు. తప్పకుండా ట్రాఫిక్ చలానాలు కట్టి ఉంటాడు. అందుకే ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు సదరు పెద్దాయన.

* కాకినాడలో ఘటన..
కాకినాడ భానుగుడి జంక్షన్ లో ట్రాఫిక్ సిఐ రామారావు విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడకు వెళ్లిన పెద్దాయన.. కారుతో పాటు బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇచ్చాడు. ఈ నెంబర్లతో ట్రాఫిక్ చలానాలు కానీ.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ నమోదు అయ్యాయా అని ఆరా తీశాడు. అలా ఎందుకు ఆరా తీస్తున్నారని సీఐ ప్రశ్నించగా.. ఇది తన కాబోయే అల్లుడు వాహనాల నంబర్లు అని.. ఆయన క్యారెక్టర్ తెలుసుకునేందుకు ఇలా మిమ్మల్ని ఆశ్రయించానని చెప్పగా.. సిఐ రామారావు ఎంతగానో ఆనందించారు. వెంటనే ఆ నెంబర్లతో సెర్చ్ చేయగా ఎటువంటి చలానాలు లేవు. కేసులు కూడా నమోదు కాలేదు. ఆ విషయం చెప్పడంతో పెద్దాయన అక్కడ నుంచి ఆనందంతో వెళ్లిపోయాడు. కుమార్తెకు వివాహం ఖరారు చేస్తానని చెప్పాడు. ఆ పెద్దాయన లాంటి ఆలోచనను ప్రతి తల్లిదండ్రులు చేస్తే.. చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు సీఐ రామారావు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper