Homeఆంధ్రప్రదేశ్‌AP Farmers: కూటమి సర్కారు చేయూత.. అన్నదాతకు భరోసా.. ఈసారి పంట దిగుబడి ఎలా ఉందంటే..

AP Farmers: కూటమి సర్కారు చేయూత.. అన్నదాతకు భరోసా.. ఈసారి పంట దిగుబడి ఎలా ఉందంటే..

AP Farmers: కరువు ఇబ్బంది పెట్టినప్పటికీ.. వర్షాలు ముఖం చాటేసినప్పటికీ… పట్టిసీమ ద్వారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం డెల్టా రైతులకు సాగునీరు అందించింది. వరి నారుమడుల నుంచి మొదలుపెడితే కోతల సమయం ముందు వరకు క్రమం తప్పకుండా నీరు అందించింది.. కాలువల్లో పూడుకుపోయిన పూడికను తొలగించింది. ఫలితంగా ఈసారి ఎన్నడూ లేని విధంగా డెల్టా రైతులకు వరి పంట పండింది. వరుస తుఫాన్లు ఇబ్బంది పెట్టినప్పటికీ.. ప్రభుత్వం ముందుగానే బీమా మీద అవగాహన కల్పించడంతో.. […]

AP Farmers: కరువు ఇబ్బంది పెట్టినప్పటికీ.. వర్షాలు ముఖం చాటేసినప్పటికీ… పట్టిసీమ ద్వారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం డెల్టా రైతులకు సాగునీరు అందించింది. వరి నారుమడుల నుంచి మొదలుపెడితే కోతల సమయం ముందు వరకు క్రమం తప్పకుండా నీరు అందించింది.. కాలువల్లో పూడుకుపోయిన పూడికను తొలగించింది. ఫలితంగా ఈసారి ఎన్నడూ లేని విధంగా డెల్టా రైతులకు వరి పంట పండింది.

వరుస తుఫాన్లు ఇబ్బంది పెట్టినప్పటికీ.. ప్రభుత్వం ముందుగానే బీమా మీద అవగాహన కల్పించడంతో.. చాలామంది రైతులు ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. దీంతో బ్యాంకులు పరిహారం ఇస్తున్నాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ పథకాలను చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రైతులకు అమలు చేస్తుండడంతో ఇబ్బందులేకుండా పోయింది. ఇక ఈసారి వానాకాలం పంటగా వరి సాగుచేసిన రైతులకు దిగుబడి అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తున్నది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

డెల్టా పరిధిలో స్వర్ణ.. సాంబ మసూరి వంటి రకాలకు ఏకంగా ఎకరానికి 30 నుంచి 35 బస్తాల వరకు దిగుబడి వస్తున్నది. 1061, తరంగిణి, అమూల్య వంటి రకాలు కూడా చాలా ప్రాంతాలలో 35 బస్తాల దాకా దిగుబడి వస్తున్నది. కరువు వల్ల ఈ ఏడాది వరి విస్తీర్ణం తగ్గినప్పటికీ.. ప్రభుత్వం పట్టిసీమ ద్వారా నీటిని సరఫరా చేయడంతో రైతులు పంట సాగు చేశారు. వరుస తుఫానుల వల్ల కొంతమేర నష్టం ఏర్పడినప్పటికీ.. ఈసారి గతంలో మాదిరిగా తెగుళ్లు.. దోమ వంటివి లేకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మేలైన యాజమాన్య పద్ధతులను పాటించారు. తద్వారా దిగుబడులు ఆశాజనకంగా వస్తున్నాయి.

ఈ ఏడాది ప్రభుత్వం సాధారణ రకం క్వింటా ధాన్యానికి రూ.2441, గ్రేడ్ ఏ రకానికి రూ.2,461 మద్దతు ధర నిర్ణయించింది. రైతులు కూడా 80 కిలోల బస్తా చొప్పున ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ ప్రకారం సాధారణ రకానికి 80 కిలోల బస్తాకు రూ.1,952, గ్రేడ్ ఏ రకానికి రూ.1,969 కి విక్రయిస్తున్నారు. ప్రభుత్వం పెట్టుబడి సహాయాన్ని అందించడం.. సకాలంలో ఎరువులు అందించేలా చూడడంతో రైతులకు ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయింది. పైగా అంది వచ్చిన అవకాశాలను ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంది. నీటిని ఒడిసి పట్టింది. లిఫ్ట్ చేసి పంటపొలాలకు సరఫరా చేసింది. తద్వారా ఈసారి డెల్టా రైతులకు ఎన్నడు లేని విధంగా ఈసారి రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడి వస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper