Neerukonda Reservoir:తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో నీటి కరువు తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆంక్షలు మొదలయ్యాయి. హైదరాబాద్ నగరానికి సరిగా చలికాలంలోనే తాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక వేసవికాలంలో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ప్రభుత్వం కంపెనీలకు.. హాస్టళ్లకు ప్రత్యేకమైన నిబంధనలు విధించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహించాలని.. ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని విద్యాసంస్థల నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చింది.
హైదరాబాద్ నగరంలో ఎదుర్కొంటున్న పరిస్థితిని చూసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నగరానికి అటువంటి ఇబ్బంది ఉండకూడదని ముందు చూపుతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతి నగరానికి ఎటువంటి పరిస్థితిలోనైనా ఏడాది పొడవునా తాగునీరు అందించడానికి ప్రణాళికల రూపొందించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వం కీలకమైన నీటి నిల్వ ప్రాజెక్టును చేపట్టింది. ఈ క్రమంలో నీరుకొండ వద్ద భారీ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. సుమారు 440 ఎకరాల విస్తీర్ణంలో ఈ రిజర్వాయర్ నిర్మాణం అవుతుంది. 0.4 టిఎంసిల నీటిని నిల్వచేసే సామర్థ్యం ఈ రిజర్వాయర్ సొంతం.
ఈ రిజర్వాయర్ ప్రధానంగా అమరావతి ప్రజల దావీదు అవసరాలను తీర్చడంతో పాటు వరద నియంత్రణలో కూడా కీలకపాత్ర పోషించబోతోంది. వర్షాకాలంలో వచ్చే నీటిని నిలువ చేసుకోవడం ద్వారా వేసవిలోనూ నీటి లభ్యతను మెరుగుపరచాలని ఈ ప్రాజెక్టు ద్వారా చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ రిజర్వాయర్ చుట్టూ సుమారు 158 ఎకరాలలో పచ్చదనం.. గ్రీన్ స్పేస్ అభివృద్ధి చేస్తున్నారు. కేవలం నీటి నిల్వ కోసం మాత్రమే కాకుండా.. పర్యటకులను ఆకర్షించే విధంగా ఈ ప్రాంతాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చినాటికి ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొస్తారు. మొత్తంగా మీరు కొండ రిజర్వాయర్ అమరావతి భవిష్యత్తు నీటి అవసరాలను.. వరద నియంత్రణను.. పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే విధంగా ఉంది. భవిష్యతు కాలంలో అమరావతి నగరానికి నీటికొరత తలెత్తకుండా ఉండేందుకు చంద్రబాబు ఎంతో ముందో చూపుతో ఈ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. కేవలం నీరుకొండ మీదమాత్రమే కాకుండా ..ఇతర నీటి వనరుల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఏర్పడిన పరిస్థితిని మనసులో పెట్టుకుని అమరావతి నగరానికి భవిష్యత్ లో ఆ సమస్య రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నీరు కొండను దాదాపు 440 ఎకరాల్లో నిర్మిస్తున్నారంటే చంద్రబాబు అమరావతి విషయంలో ఎటువంటి ముందుచూపుతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.