Spain Morocco Tunnel Project: ఆ రెండు దేశాల మధ్య కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే. అయతే మధ్యలో సముద్రపు నీరు. అయినా ఈ రెండు దేశాల మధ్య వంతెన నిర్మిస్తే ప్రపంచంలోని పలు దేశాలు ఎన్నో ప్రయోజనాలు పొందుతాయి. అయితే ఆ వంతెన నిర్మాణానికి 1980 నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక పరిశోధనల మధ్య ఇక్కడ వంతెన నిర్మించడం సాధ్యంకాదని భూగర్భ శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఇప్పుడు టన్నెల్ నిర్మించాలనిఅనుకుంటున్నారు. మరి ఇది సాధ్యమేనా? ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడుంది?
స్పెయిన్, మొరాకో దేశాలను వేరు చేసే ‘జిబ్రాల్టర్ జలసంధి’ (Strait of Gibraltar) మీదుగా ఒక వంతెన లేదా సొరంగాన్ని నిర్మించడం అనేది దశాబ్దాలుగా సాగుతున్న ప్రక్రియ. ఐరోపా, ఆఫ్రికా ఖండాలను కలిపే ఈ ప్రాజెక్ట్ గురించి 1980ల నుండే ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు జరుగుతున్నాయి. 1980లో యూరఫ్ ఖండంలోని స్పెయిన్ రాజు జువాన్ కార్లోస్ I, ఆఫ్రికా ఖండంలోని మొరాకో రాజు హసన్ II ఈ ప్రాజెక్టుపై ప్రాథమిక అంగీకారానికి వచ్చారు. అప్పటి నుం చి SECEGSA (స్పెయిన్) , SNED (మొరాకో) వంటి ప్రత్యేక సంస్థలు ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాయి. 2003లో ఇరు దేశాలు సముద్ర గర్భం ద్వారా రైలు సొరంగాన్ని నిర్మించడానికి అంగీకరించాయి. ఇటీవలి కాలంలో 2023, 2025లో ఈ ప్రాజెక్టుపై మరోసారి ఆసక్తి రిగింది. 2030 ఫిఫా వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా ఈ సొరంగ మార్గాన్ని మరింత వేగవంతం చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.
ఈ ప్రాంతంలో వంతెనను నిర్మించకపోవడానికి ప్రధాన కారణం భౌగోళిక , ఇంజనీరింగ్ సవాళ్లు. జిబ్రాల్టర్ జలసంధి అతి తక్కువ వెడల్పు (సుమారు 14 కిలోమీటర్లు) కలిగినప్పటికీ, దాని లోతు ఆశ్చర్యకరంగా 300 నుండి 900 మీటర్ల వరకు ఉంటుంది. ఇంత లోతైన సముద్ర గర్భంలో వంతెన కోసం పునాదులు వేయడం ఇంజనీరింగ్ పరంగా అత్యంత కష్టమైన పని. అంతేకాకుండా, అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యధరా సముద్రం కలిసే ఈ ప్రాంతంలో నీటి ప్రవాహాలు చాలా వేగంగా ఉంటాయి. వీటితో పాటు, ఈ ప్రాంతం భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న ‘సిస్మిక్ జోన్’ (seismically active zone) లో ఉండటం కూడా భద్రతాపరమైన ఆందోళనలను పెంచుతోంది.
అయితే వంతెన కంటే సొరంగ మార్గమే (Tunnel) మేలని భావించి, దానిపైనే ఇప్పుడు పరిశోధనలు సాగుతున్నాయి. సుమారు 42 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం కోసం ప్రణాళికలు రూపొందుతున్నాయి, ఇది కేవలం సముద్రం మీదుగానే కాకుండా భౌగోళికంగా అనుకూలమైన మార్గాల గుండా వెళ్తుంది. ఈ వంతెన మొత్తం పొడవు 60 కిలోమీటర్లు. ఇందులో 28 కి.మీ. సముద్రం అడుగున ఉంటుంది. స్పెయిన్‌లో Punta Paloma నుంచి మొరాకోలో Punta Malabata వరకు దీనిని నిర్మంచనున్నారు. సముద్ర మట్టం నుంచి 175–475 మీటర్ల లోతులో ఫిల్లర్లు వేయనున్నారు. దీనికి 15–30 బిలియన్ల డాలర్లకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
2030లో స్పెయిన్, మొరాకో మరియు పోర్చుగల్ కలిసి FIFA వరల్డ్ కప్‌ను నిర్వహించనున్నాయి. ఈ సమయానికి టన్నెల్ సిద్ధంగా ఉంటే, అభిమానులు యూరప్ , ఆఫ్రికా మధ్య సులభంగా ప్రయాణించవచ్చు అని ఆశించారు. కానీ, అనిశ్చితమైన భూగోళశాస్త్ర సవాళ్ల కారణంగా టన్నెల్ 10 ఏళ్ల ఆలస్యం అయ్యింది. దీంతో 2040 తర్వాతే ఇది ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
