Today 1 Sep 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై అశ్వినీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉండడంతో సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో వారితో ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది. అనుకున్న దానికంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా పదోన్నతులు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త ప్రాజెక్టులను చేపడుతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దు. నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయాలి.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు కొత్త ఆలోచనలు ప్రతిఫలాన్ని ఇస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు అధిక లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదే సమయంలో ఖర్చులను నియంత్రించుకోవాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇంటి నిర్మాణానికి వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులకు గురి కావచ్చు. అయితే ఇలాంటి సమయంలో పెద్దల సలహా పాటించాలి. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. మానసికంగా ప్రశాంతత కోసం ధ్యానం చేయడం అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండే ప్రయత్నం చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులు పరిచయమైనా కూడా వారితో అప్పుడే ఒప్పందాలకు ముందుకు వెళ్లదు. పెద్దల సలహాతో అవసరమైన నిధులు సేకరిస్తారు. అప్పుల ఊబిలో నుంచి బయటపడేందుకు మార్గం ఏర్పడుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలపై దృష్టి పెడతారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. నూతన భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబంలో పరస్పర అవగాహన ఉండడం వల్ల సంతోషకర వాతావరణముంటుంది. శారీరక శ్రమ కలిగితే తగిన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో వ్యాపార ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘ కాలిక లాభాలు వచ్చే పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా లాభాలను వందే అవకాశం. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టును పూర్తి చేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు గతంలో మొదలుపెట్టిన పనులను ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు. వీరికి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఈరోజు అంతా ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను వెంటనే పూర్తి చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు అధికారుల అండదండలతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి లాభాలు తీసుకొస్తాయి. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశాలు ఉంటాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్నీ కలిసి వస్తాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న సమయంలో ప్రాజెక్టును పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. పూర్వీకుల ఆశకి సంబంధించి శుభవార్తలు వింటారు. పౌష్టికాహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు తమ నైపుణ్యాన్ని పెట్టుబడి పెట్టి సమాజంలో గౌరవం పొందుతారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందుతాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అవసరమైన వనరులు సేకరిస్తారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేస్తారు.